పరిటాల అడ్డాలో జగన్ మాస్ వార్నింగ్..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ మరో సారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కేడర్ పైన జరుగుతున్న దాడుల్లో బాధ్యులైన ప్రతీ ఒక్కరినీ బట్టలూడదీసి నిలబెడతామని.. చట్టం మేర శిక్షిస్తామని హెచ్చరించారు. చంద్రబాబుకు గులాం గిరీ చేసే పోలీసులకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని జగన్ పేర్కొన్నారు. వైసీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాప్తాడులో ఎమ్మెల్యే కుమారుడు అక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయరని జగన్ నిలదీసారు.
రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో బీహార్ ను మించిన హత్యా రాజకీయాలు నడుపుతు న్నారని ఫైర్ అయ్యారు. పోసాని నంది అవార్డుల పైన చేసిన వ్యాఖ్యలను అరెస్ట్ చేసి నెల రోజుల కు పైగా నిర్బంధించారని వివరించారు. ఏపీలో ప్రభుత్వం, పోలీసులు కలిసి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పిన్నెల్లి పై కుట్ర పూరితంగా కేసులు పెట్టి వేధించారని చెప్పుకొచ్చారు. పోసాని పై 18 అక్రమ కేసులతో వేధింపులకు గురి చేసారని వివరించారు.

నందిగం సురేశ్ పై అక్రమ కేసులతో 145 రోజుల జైల్లో ఉంచారన్నారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలుగా పేర్కొన్నారు. చంద్రబాబు దౌర్జన కాండకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మెప్పు కోసం కొందరు పోలీసులు పని చేస్తున్నారని.. టోపీ పై సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబుకు వాచ్ మెన్ లా పని చేస్తున్న పోలీసులు.. ఎల్లకాలం కూటమి పాలన కొనసాగదని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదలమని.. చంద్రబాబుకు ఊడిగం చేసిన వారికి శిక్ష తప్పదని.. యూనిఫాం తీయించి చట్టం ముందు నిలబెడతామని జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications