బిగ్ టర్న్: జగన్ టీమ్ లోకి చంద్రబాబు స్ట్రాటజిస్ట్ - లెక్కలు మారుతాయా?
ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు మారుతున్నాయి. కూటమి పార్టీలు జగన్ లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అటు జగన్ సైతం కూటమి పైన పోరాటానికి సిద్దం అవుతు న్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు.. రాజకీయ నిర్ణయాల పైన తాజాగా ఢిల్లీ కేంద్రంగా ప్రశాంత్ కిశోర్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. కీలక అంశాలు చర్చించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేసిన షో టైం కన్సెల్టెన్సీ సేవలను కొనసాగిస్తున్నారు. అయితే, అనూహ్యంగా ఈ టీంలో పని చేసిన కీలక కన్సెల్టెంట్ ఇప్పుడు జగన్ కోసం పని చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.
మారుతున్న లెక్కలు
2019 ఎన్నికల్లో జగన్ కోసం ప్రశాంత్ కిశోర్ సారధ్యంలో ఐప్యాక్ టీం రాజకీయ వ్యూహాల్లో సేవలు అందించింది. ఆ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన జగన్ అధికారం చేపట్టారు. ప్రభుత్వ ఏర్పాటు తరువాత కొంత కాలానికి ప్రశాంత్ కిశోర్ ఇతర రాష్ట్రాల పైన ఫోకస్ చేసారు. రాజకీయ వ్యూహకర్త సేవలకు దూరం అయ్యారు. ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేసిన రాబిన్ సింగ్ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. 2024 ఎన్నికల్లోనూ వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. కానీ, ఆ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైంది. 2019 ప్రశాంత్ కిశోర్ టీంలో మరో సభ్యుడిగా ఉన్న రాబిన్ శర్మ - శంతన్ టీంలు టీడీపీ కోసం తాము ఏర్పాటు చేసిన షో టైం కన్సల్టెన్సీ ద్వారా సేవలు అందించారు.

వైసీపీ కోసం కొత్తగా
2024 ఎన్నికల వేళ ప్రశాంత్ కిశోర్ సలహాలు - సూచనలు, సేవలను టీడీపీ వినియోగించు కుంది. ప్రచారంలో ప్రశాంత్ కిశోర్ సూచించిన అంశాలు ప్రచారంలో టీడీపీకి కలిసి వచ్చాయి. ఇక, నాడు టీడీపీ కోసం పని చేసిన షో టైం కన్సల్టెన్సీ ప్రస్తుతం టీడీపీకి రాజకీయంగా తమ వ్యూహాలు.. సర్వీసులు అందిస్తోంది. ఈ టీంలో కీలకంగా ఉన్న శంతన్ ఇప్పుడు వైసీపీ కోసం పని చేసేందుకు రంగంలోకి దిగుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇదే వాదన టీడీపీతో పాటుగా వైసీపీ లోనూ బలంగా వినిపిస్తోంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీలో ముఖ్యులను టీడీపీలోకి తీసుకు రావటం.. టీడీపీ నేతలను జనసేన - బీజేపీ నుంచి పోటీ చేయించటంలో శంతన్ సలహా లు కీలకంగా పని చేసాయి. సానుకూల ఫలితాలను ఇచ్చాయి.

జగన్ కోసం రంగంలోకి
2019 ఎన్నికల్లో జగన్ కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్ టీంలో శంతన్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వైసీపీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనేది జగన్ ఆలోచనగా ఉంది. ఇప్పుడు ముందుగా పార్టీ కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా పర్యటనలు.. సమావేశాలను ఉగాది నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో మిషన్ -2029 లక్ష్యంగా ఉగాది నుంచి కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా శంతన్ పొలిటికల్ స్ట్రాటిజిస్ట్ గా వైసీపీకి సేవలు అందించేందుకు రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది. వచ్చే నెల మార్చి 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుందని పార్టీ నేతల సమాచారం. మరి.. ఈ నిర్ణయం వైసీపీకి ఎంత వరకు కలిసి వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications