అందుకే ఢిల్లీకి బాబు, కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి: బొత్స, ఎంపీలతో జగన్ స్కైప్ మీటింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మంగళవారం మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు చేస్తున్న దీక్ష కేంద్రానికి పట్టదా అని నిలదీశారు. బీజేపీ పట్టించుకోదా అన్నారు.

దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కాదా అని నిలదీశారు. రాజ్యాంగం మాకు వర్తించదా అన్నారు. కేంద్రం పట్టించుకోకుంటే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందన్నారు. హోదా కోసం రేపటి రైల్ రోకోకు అందరూ సహకరించాలన్నారు.

చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అగ్రిగోల్డ్ సంప్రదింపుల కోసమే జరిగిందని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులు టీడీపీ నేతలను నిలదీయాలన్నారు.

టీడీపీకి గట్టి షాక్: వైసీపీలోకి యలమంచిలి రవి, బాబు బుజ్జగించినా నో!

YS Jagan skype meeting with MPs

అగ్రిగోల్డ్ బాధితులను వంచించడానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని, కానీ హోదా కోసం కాదన్నారు. ఏపీ భవన్ ఫుటేజీని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో టీడీపీ తమతో కలిసి రావాలన్నారు. చిత్తశుద్ధితో చంద్రబాబు పని చేయాలన్నారు.

ఎంపీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

వైసీపీ అధినేత వైయస్ జగన్ స్కైప్ ద్వారా మంగళగిరి నుంచి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన ఎంపీల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మీ పోరాటం వృథా కాదన్నారు. ప్రజలంతా చూస్తున్నారని చెప్పారు. మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీశారు. కాగా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీల ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం తెలిసిందే. 

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party chief YS Jagan Mohan Reddy skype meeting with party MPs on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి