బాబు చొక్కా, నారాయణ నిక్కరు విప్పుతా: జగన్ విమర్శల దాడి

నంద్యాల: ఉపఎన్నికల ప్రచారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినే వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే చంద్రబాబు చొక్కా.. మంత్రి నారాయణ నిక్కరు విప్పేసి ఇప్పిస్తానని కేశవరెడ్డి, అగ్రిగోల్డ్‌ బాధితులనుద్దేశించి అన్నారు.

అదే నా ఆస్తి.. అధికారంలోకి రాగానే..

అదే నా ఆస్తి.. అధికారంలోకి రాగానే..

నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన పట్టణంలోని సాయిబాబానగర్‌లో ప్రచారం నిర్వహించారు. 2019లో తమ ప్రభుత్వం రాగానే కేశవరెడ్డి, అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. తనపై ప్రజలకున్న నమ్మకమే తన ఆస్తిగా పేర్కొన్నారు.

బాబు పాలనపై..

బాబు పాలనపై..

ప్రజలకు సేవ చేయడంలో తన తండ్రి వైయస్‌ ఫొటోలాగానే తన ఫొటో కూడా ఉంచుకునే విధంగా పాలన అందిస్తామని జగన్ తెలిపారు. నంద్యాల ఉప ఎన్నిక నీతి, నిజాయితీ మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. చంద్రబాబు మూడున్నర ఏళ్లలో చేసిన మోసాలు, అవినీతి, అక్రమాలు అన్నీఇన్నీ కావని చెప్పారు.

ప్రజల ఆశీస్సులతో..

ప్రజల ఆశీస్సులతో..

ప్రజల ఆశీస్సులతో తాను అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలాన్ని ఉచితంగా రిజిష్ట్రేషన్ చేయించి ఇస్తామన్నారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేషన్‌ షాపుకు వెళ్తే 9 రకాల వస్తువులు ఇచ్చేవారని, ఇప్పుడు బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని జగన్ తెలిపారు.

బాబు నెరవేర్చని హామీలు..

బాబు నెరవేర్చని హామీలు..

బెల్టు షాపులను రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇంత వరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఫోన్‌ మెసేజ్‌ చేస్తే చాలు మద్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు రూ.14 వేల కోట్లు రుణ మాఫీ చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. బాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+