ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు:జగన్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:ఆంద్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని టిడిపి అపహస్యం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జగన్ సోమవారం నాడు స్పందించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను కొనుగోళ్ళకు పాల్పడిందని వైసిపి అధినేత జగన్ ఆరోపించారు.డబ్బుతో గెలిచిన గెలుపు ఓ గెలుపేనా అంటూ ఆయన ప్రశ్నించారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా ప్రతినిధులను అద్భుతంగా కొనుగోలు చేశాడని ఆయన ఆరోపించారు.

ys jagan slams on tdp chief chandra babu naidu

గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ టిడిపి ఎమ్మెల్యే పట్టుబడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడ అదే విధంగా వ్యవహరించారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఆంద్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోబాలకు దిగడంతో టిడిపి అభ్యర్థులు అతికష్టం మీద విజయం సాధించారని చెప్పారు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్ఆర్ సిపి గట్టిపోటీ ఇచ్చిందన్నారు. అధికారికంగా టిడిపి గెలిచినా నైతిక విజయం తమదేనని ఆయన చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ys jagan slams on tdp chief chandra babu naidu.tdp buy local bodies elected representites for mlc elections he said on monday, after result of local body mlc elections.
Please Wait while comments are loading...