ys jagan on ys Sharmila: కడపలో షర్మిలపై జగన్ ఫైర్-పోటీ అసలు కారణమిదే..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తున్న కడప లోక్ సభ ఎన్నికలపై సీఎం వైఎస్ జగన్ ఇవాళ మరోసారి స్పందించారు. కడపలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న సీఎం జగన్....లోక్ సభ బరిలోకి దిగిన సోదరి షర్మిలపై ఆమె పేరెత్తకుండానే విమర్శలు చేశారు. అంతే కాదు ఆమె పోటీ వెనుక ఉన్న కారణాన్ని కూడా జగన్ తేల్చేశారు.
మన ఓట్లు చీల్చాలని, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర అని సీఎం వైఎస్ జగన్ కడప సభలో ఆరోపించారు. చంద్రబాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తున్నాడన్నారు. మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ ఎన్నికల కోసం నాన్న సమాధి దగ్గరకు ఢిల్లీ నుంచి వస్తారట అంటూ రాహుల్ గాంధీపై జగన్ మండిపడ్డారు. రేపు కడపకు రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో జగన్ ఆయన్ను టార్గెట్ చేశారు.

కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన కళ్లను మనం పొడుచుకున్నట్లే అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీయేను గెలిపించడం కాదా అని అడిగారు. చంద్రబాబు పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తారంటూ జగన్ విమర్శలు గుప్పించారు. రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయన్నారు.
కడపలో షర్మిలపై జగన్ ఫైర్-పోటీ అసలు కారణమిదే..!#YSJagan #YSSharmila #Kadapa #APElections2024 #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/f4tyF8DRaW
— oneindiatelugu (@oneindiatelugu) May 10, 2024












Click it and Unblock the Notifications