దాడి: రోజాకు జగన్ పలకరింపు, ప్రభుత్వంపై విమర్స

హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని నగరిలో దాడికి గురైన తమ పార్టీ శాసనసభ్యురాలు, సినీ నటి రోజాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పలకరించారు. పోన్ చేసి ఆమెను పరామర్శించారు. రోజా ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు.

రోజాపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. పోలీసుల సమక్షంలో మహిళా ఎమ్మెల్యేపై దాడి జరగడం దారుణమని ఆయన అన్నారు. మహిళా ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆయన అన్నారు. రోజాపై జరిగిన దాడి సంఘటనపై విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

YS Jagan

సంఘటనకు సంబంధించిన దోషులను కఠినంగా శిక్షించి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అమ్మవారి జాతరలో హారతి వెలిగించే సందర్భంలో రోజాపై దాడి జరిగింది.

దాడిలో రోజా చేతికి గాయమైంది. తెలుగుదేశం పార్టీవారే ఈ దాడికి పాల్పడ్డారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు దాడిని నిరసిస్తూ రోజాతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో నగరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+