వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధనస్సు ఎక్కుపెట్టిన జగన్, కౌగిలించుకుని(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి: నిజాయితీ, విశ్వసనీయత అనే పదాలకు అర్థం తెలిసిన వాడే నాయకుడుగా ఉండాలని, కార్యకర్తలు తమ నాయకుడ్ని చూసుకుని గర్వపడేలా ఉండాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి వైయస్ జనభేరి సభలు నిర్వహించారు. నరసాపురంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆయన రోడ్ షో నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఆల్ ఫ్రీ హామీలపై వైయస్ జగన్మోహన్ రెడ్డి విరుకుకుపడ్డారు. అధికారంలో అనేక కుట్రలు పనున్నుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, తన సోదరుడు కొత్తపల్లి జానకి రామ్, వందలాది మంది అనుచరులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బరాయుడికి పార్టీలోనే కాదు.. తన గుండెల్లో చోటిస్తున్నానని జగన్ తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 54 ప్రభుత్వరంగ సంస్థలను మూసేశారని ఆరోపించారు. ఇప్పుడేమో ప్రజలను మోసం చేయడానికి సాధ్యం కానీ హామీలిస్తున్నారని విమర్శించారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో కార్యకర్తలు, అభిమానులు ఆయనపై పూలవర్షం కురిపించారు. అంతకుముందు సభలో వైయస్ జగన్ ను కొత్తపల్లి సుబ్బరాయుడు, ఇతర నాయకులు గజమాలతో సత్కరించారు. అవినీతిపై రామబాణాన్ని ఎక్కుపెట్టినట్లుగా పూల ధనస్సుతో బాణాన్ని జగన్ ఎక్కుపెట్టారు.

గుర్రాల బగ్గీపై రోడ్‌షో

గుర్రాల బగ్గీపై రోడ్‌షో

నిజాయితీ, విశ్వసనీయత అనే పదాలకు అర్థం తెలిసిన వాడే నాయకుడుగా ఉండాలని, కార్యకర్తలు తమ నాయకుడ్ని చూసుకుని గర్వపడేలా ఉండాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

పూల ధనస్సు ఎక్కుపెట్టి..

పూల ధనస్సు ఎక్కుపెట్టి..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఆల్ ఫ్రీ హామీలపై వైయస్ జగన్మోహన్ రెడ్డి విరుకుకుపడ్డారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, తన సోదరుడు కొత్తపల్లి జానకి రామ్, వందలాది మంది అనుచరులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

జగన్ వందనం

జగన్ వందనం

శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి వైయస్ జనభేరి సభలు నిర్వహించారు. నరసాపురంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆయన రోడ్ షో నిర్వహించారు.

కొత్తపల్లిని కౌగిలించుకుని..

కొత్తపల్లిని కౌగిలించుకుని..

ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బరాయుడికి పార్టీలోనే కాదు.. తన గుండెల్లో చోటిస్తున్నానని జగన్ తెలిపారు.

జనభేరీలో జగన్ ప్రసంగం

జనభేరీలో జగన్ ప్రసంగం

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 54 ప్రభుత్వరంగ సంస్థలను మూసేశారని ఆరోపించారు. ఇప్పుడేమో ప్రజలను మోసం చేయడానికి సాధ్యం కానీ హామీలిస్తున్నారని విమర్శించారు.

రోడ్‌షోలో జగన్

రోడ్‌షోలో జగన్

వైయస్ జగన్మోహన్ రెడ్డి రోడ్‌షోలో కార్యకర్తలు, అభిమానులు ఆయనపై పూలవర్షం కురిపించారు.

English summary
YSR Congress party chief Y S Jagan Mohan Reddy on Friday began his 4-day tour of West and East Godavari districts from Narsapuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X