వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీన్ రివర్స్: బాబుకు 'అసంతృప్తి' షాక్, జగన్ పావులు, వైసిపి వైపు అడుగులు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులు చాలామంది తిరిగి ఆ పార్టీలోకి తిరిగి రానున్నారా? ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వైసిపి నుంచి వచ్చిన నేతలు షాకివ్వనున్నారా? అంటే అవుననే అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులు చాలామంది తిరిగి ఆ పార్టీలోకి తిరిగి రానున్నారా? ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వైసిపి నుంచి వచ్చిన నేతలు షాకివ్వనున్నారా? అంటే అవుననే అంటున్నారు.

తెలుగు రాష్ట్రాలలో ఏడా తొలుత పెద్ద ఎత్తున నేతలు అధికార పార్టీలలోకి జంప్ అయ్యారు. ఆ తర్వాత కూడా అప్పుడపుపుడు పార్టీ మారుతున్నారు. ఇందులో భాగంగా ఏపీలో వైసిపి నుంచి పెద్ద ఎత్తున టిడిపిలో చేరారు.

<strong>కొత్త మలుపు: 'కలెక్టరే జగన్ చొక్కా పట్టుకొని లాగారు, ఆధారాలతో కోర్టుకు'</strong>కొత్త మలుపు: 'కలెక్టరే జగన్ చొక్కా పట్టుకొని లాగారు, ఆధారాలతో కోర్టుకు'

అయితే, టిడిపిలో చేరిన వారిలో చాలామంది తిరిగి వైసిపి బాట పట్టనున్నారని అంటున్నారు. ఆ ఆపరేషన్ ఆకర్షే ఇప్పుడు రివర్స్ అయ్యింది. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు మొదలుకుని ఎంపీటీసీ, జడ్పీటీసీల వరకూ వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

 వైసిపి నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం

వైసిపి నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం

అయితే త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వలసలతో టీడీపీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇంతకీ వైసీపీలో వలసలు వెనుక అసలు కారణాలేంటని ఆరా తీస్తే మూడు దశాబ్ధాలుగా పార్టీని నమ్ముకుని పని చేస్తున్న వారికి సముచిత స్థానం దక్కలేదన్న అసంతృప్తి పై స్థాయినుంచి కింది స్థాయి వర్గాల వారికి తీవ్రంగా ఉందని చెబుతున్నారు.

ఎన్నికల ముందు ఆ తర్వాత కాంగ్రెస్, వైసీపీ నుంచి వచ్చిన వారికే అధిష్టానం ప్రాధాన్యత ఇస్తోందనే అసంతృప్తి పార్టీ సీనియర్ కేడర్‌‌‌లో నెలకొంది. పదేళ్లపాటు తమను ఇబ్బంది పెట్టిన వారే తమపై పెత్తనం చేస్తున్నారని పార్టీ కూడా వారికే సీట్లు కేటాయిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారట.

 వాకాటికి టిక్కెట్‌పై అసంతృప్తి

వాకాటికి టిక్కెట్‌పై అసంతృప్తి

ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వచ్చిన వాకాటి నారాయణ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

పావులు కదుపుతున్న వైసిపి

పావులు కదుపుతున్న వైసిపి

దీనిని వైసిపి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎలాగైనా పార్టీలోకి చేర్చుకుని అధికార పార్టీకి గట్టి షాకిచ్చేందుకు పావులు కదుపుతున్నారు. తమ పార్టీ అభ్యర్థులు ఆనం విజయ్ కుమార్ రెడ్డిని గెలిపించుకునేందుకు టీడీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎరవేస్తున్నారని తెలుస్తోంది.

ఆపరేషన్ వికర్ష్..

ఆపరేషన్ వికర్ష్..

ఇప్పటికే ఇందుకూరుపేట మాజీ జడ్పీటీసీ ఆదిశేషా రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీగా ఉన్న ఆయన సతీమణి రేణుక మరో ఇద్దరు ఎంపీటీసీలు మరో ముగ్గురు టీడీపీ సభ్యులు జగన్ సమక్షంలో కండువా కప్పుకొన్నారు.

నాయుడుపేట, సుళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, కొవ్వూరు నియోజకవర్గాల్లోను నగర పంచాయితీకి చెందిన కొందరు నేతలు వైసీపీ బాట పట్టేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. మరికొందరు టిడిపిలో ఉంటూ వైసిపికి ఓటు వేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

టీడీపీ, వైసీపీ నేతలు ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లను క్యాంపులకు తరలిస్తున్నారు. ఇక్కడ టిడిపికి సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయి. ఎందుకంటే స్థానిక నేతలు చాలామంది టిడిపిలో చేరారు.

మొత్తం 847 స్థానాల్లో 483 స్థానాలు టీడీపీ వశమయ్యాయి. ఈ లెక్కన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ గెలవాలి. కానీ తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. గతంలో టీడీపీలోకి వచ్చిన వారితో సహా మరికొందరు టీడీపీ నేతలు సహా వైసీపీ అభ్యర్థికి ఓటేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

English summary
It is said that Many leaders who joined Telugudesam Party from YSR Congress party may rejoin in YSRCP in SPS Nellore District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X