వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా ఆమె వల్లే.. వైసిపి నేతల ఫిర్యాదు: జగన్ ఎఫెక్ట్, మారిన రోజా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా ఇటీవలి కాలంలో అధికార పార్టీ పైన పెద్దగా విరుచుకుపడటం లేదని అంటున్నారు. గతంలో ఇష్టారీతిన మాట్లాడేవారని, కానీ ఈ మధ్య అది తగ్గిందని చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా ఇటీవలి కాలంలో అధికార పార్టీ పైన పెద్దగా విరుచుకుపడటం లేదని అంటున్నారు. గతంలో ఇష్టారీతిన మాట్లాడేవారని, కానీ ఈ మధ్య అది తగ్గిందని చెబుతున్నారు.

దెబ్బకు పవన్ కళ్యాణ్‌పై మంత్రి యూటర్న్, చంద్రబాబు అసహనం?దెబ్బకు పవన్ కళ్యాణ్‌పై మంత్రి యూటర్న్, చంద్రబాబు అసహనం?

 అంత దూకుడు లేదు

అంత దూకుడు లేదు

నంద్యాల ఉప ఎన్నికల సమయంలో రోజా మాటలు కూడా దెబ్బతీశాయనే వాదనలు వినిపించాయి. అప్పుడే ఆమెకు జగన్ క్లాస్ పీకారని ప్రచారం జరిగింది. ఇటీవలి కాలంలోను ఆమె అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నా దూకుడు లేదు.

ఆంక్షలు విధించినా లెక్క చేయలేదు

ఆంక్షలు విధించినా లెక్క చేయలేదు

ఆ దూకుడు తగ్గడానికి పార్టీ అధినేత జగనే కారణమని అంటున్నారు. రోజా గతంలో తిరుమల కొండపై కూడా రాజకీయాలు మాట్లాడేవారు. టిటిడి ఆంక్షలు విధించినా ఆమె వాటిని లెక్కచేయలేదు.

 మీడియాకు రోజా నో

మీడియాకు రోజా నో

కానీ ఖతార్ పర్యటన అనంతరం శ్రీవారి దర్శనానికి వచ్చిన రోజా గతానికి భిన్నంగా వ్యవహరించారని అంటున్నారు. కుటుంబసభ్యులతో తిరుమలకు వచ్చారు. మీడియా ప్రతినిధులకు మాత్రం ఆమె నో చెప్పారట. మీడియా ప్రతినిధులు వస్తామంటే ఆమె స్నేహితులు... రోజా మాట్లాడరని చెప్పారని అంటున్నారు.

 వైసిపి నేతల ఫిర్యాదు

వైసిపి నేతల ఫిర్యాదు

నంద్యాల ఉప ఎన్నికల్లో మంత్రి అఖిలప్రియపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ పైన విమర్శలు చేశారు. అవి కూడా మన ఓటమికి కారణమని వైసిపి నాయకులు జగన్ దృష్టికి తీసుకు వెళ్లారని, దీంతో ఆయన సూచనల మేరకు తన తీరు మార్చుకున్నారని అంటున్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan reddy has suggested Nagari MLA Roja on press meets and allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X