స్పీకర్‌ను దించాలనికాదు: అవిశ్వాసంపై జగన్ వెనక్కి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి కోడెల శివ ప్రసాద్‌పై అవిశ్వాసం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది. శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రతిపాదన తీసుకు వచ్చారు. అంతకుముందే ఈ అంశంపై విష్ణుకుమార్‌ రాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించారు. ఈ క్రమంలో అవిశ్వాసంపై వైసీపీ వెనక్కి తగ్గింది. దీనిపై సభలో చర్చ జరిగింది.

YS Jagan takes U turn on No Confidence Motion

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సభాపతి పైన అవిశ్వాసం తీర్మానం నోటీసు తాము ఉపసంహరించుకుంటున్నామి చెప్పారు. దీంతో ఏప్రిల్ 4వ తేదీన శాసన సభ ప్రత్యేక సమావేశం లేదని సభాపతి చెప్పారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు తాము సహకరించామని, అయితే ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదని తాము అవిశ్వాసం పెట్టామన్నారు. స్పీకర్‌ను దించేయాలన్న ఉద్దేశ్యంతో కాదన్నారు. అవిశ్వాసం తమకున్న చివరి ఆప్షన్ అన్నారు.

ద్రవ్య వినిమయ బిల్లును పూర్తిగా సమర్ధిస్తున్నాం: కాల్వ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును తాము పూర్తిగా సమర్ధిస్తున్నామని చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు చెప్పారు. అసెంబ్లీలో కాల్వ మాట్లాడుతూ తొమ్మిది నెలల పాలనలో స్పష్టతతో ముందుకెళ్లామన్నారు. ఏపీ ఉజ్వల భవితకు బలమైన పునాది పడిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో హామి ఇచ్చిన బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+