Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ సక్సెస్ ఫుల్ వ్యూహాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన జగన్-2019 రిపీట్ చేసేలా ..!

ఏపీలో 2019 ఎన్నికలకు ముందు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బయటికి రావడం వెనుక ప్రధాన కారణం వైఎస్ జగన్. అప్పట్లో కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడం లేదని, అయినా చంద్రబాబు నోరు మెదపడం లేదనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లిన జగన్.. టీడీపీపై ఒత్తిడి పెంచారు. చివరికి చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటికి రావడమే కాకుండా బీజేపీపై దేశవ్యాప్త పోరాటం చేసి ఘోరంగా దెబ్బతిన్నారు. మరోసారి జగన్ అలాంటి వ్యూహాన్నే నమ్ముకుంటున్నారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై వైఎస్ జగన్ పోరు మొదలుపెట్టారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన ఓ సుదీర్ఘ ట్వీట్ పెట్టారు. ఇందులో చంద్రబాబు గారూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తారా అంటూ జగన్ ట్వీట్ ప్రారంభించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరుమెదపడంలేదని ప్రశ్నించారు. సవరించిన అంచనాలను ఆమేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి తీరని అన్యాయం కాదా అని అడిగారు. దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలనే దెబ్బతీస్తున్నారు కదా అన్నారు. దేనికి లాలూచీపడి మీరు ఈ పనికి ఒడిగట్టారని నిలదీశారు.

ys jagan targets Chandrababu over Polavaram height decrease by centre

ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ అంశంపై అభ్యంతరం చెప్పలేదని జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుగారూ... ఎప్పుడు ప్రజలు మీకు అధికారాన్ని అప్పగించినా రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల భవిష్యత్తును తాకట్టుపెడతారని, మీ స్వార్థరాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాలకోసం ప్రజల ప్రయోజనాలను నట్టేటా ముంచేస్తారని మరోసారి నిరూపిస్తున్నారుకదా అంటూ ఓ రేంజ్ లో చంద్రబాబును కడిగేశారు.

పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు అయితే, 41.15 మీటర్లకే మీరు ఎందుకు పరిమితంచేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. తద్వారా 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటినిల్వ 115 టీంఎసీలకే పడిపోతుందని తెలిసికూడా మీరు ఎందుకు అభ్యంతరం చెప్పడంలేదని అడిగారు. ఈ కారణంగా వరద వస్తే తప్ప కుడి, ఎడమ కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదలచేయలేని దుస్థితి నెలకొంటుందన్నారు. గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలకు స్థిరంగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. సరిగా విద్యుత్‌ను ఉత్పత్తిచేయలేమన్నారు.

శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం మహానగరానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చలేమని, అన్నికంటే సుజలస్రవంతి ప్రాజెక్టుపై ఉన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్రకు అన్యాయమే జరుగుతుందన్నారు. మీ మద్దతుమీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న వాస్తవ పరిస్థితుల మధ్య రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో మీరు ఎందుకు చేతులెత్తేస్తున్నారని అడిగారు. ఎందుకు బేలతనం చూపుతున్నారన్నారు. దీనివెనుక మీ స్వార్థం ఏంటి చంద్రబాబుగారూ అని జగన్ సూటిగా ప్రశ్నించారు. ఇలా చంద్రబాబును అన్ని విధాలుగా టార్గెట్ చేస్తూ ఈ ట్వీట్ సాగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+