జగన్ తెనాలి పర్యటన వేళ ఊహించని రాజకీయం..!!

ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. తెనాలిలో రౌడీ షీటర్ అనుచరులను పోలీసు లు కొట్టిన వీడియో వైరల్ అయింది. దీని పైన మాజీ సీఎం జగన్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రం లో రెడ్ బుక్ రాజ్యంగా నడుస్తోందని జగన్ ఆరోపించారు. నేరం చేసిన వారి పైన కఠినంగానే స్పందించాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది. ఈ సమయంలోనే జగన్ పోలీసులు కొట్టిన విక్టర్ అనే వ్యక్తిని పరామర్శించేందుకు తెనాలి వస్తున్నారు. ఇప్పుడు ఈ పర్యటన వేళ కొత్త వివాదం మొదలైంది.

మాజీ సీఎం జగన్ రేపు (మంగళవారం) తెనాలిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్‌ విక్టర్‌ కుటుంబాన్ని జ‌గ‌న్‌ పరామర్శించనున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలికి చేరుకుంటారు. పోలీసులు దలిత, మైనారిటీ యువకులను బహిరంగంగా కొట్టటం ఇప్పటికే జగన్ స్పందించారు. మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. జగన్ తెనాలి పర్య టనలో నందివెలుగు నుంచి ఇతానగర్ వరకు జగన్ రాకతో భారీ బైక్ ర్యాలీ జరగనుంది. కాగా, తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఓపెన్ ట్రీట్ మెంట్‌పై హోంమంత్రి అనిత స్పందించారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసు లేనని తెలిపారు. తప్పు చేసిన వారికి కులం ఏంటి మతం ఏంటని ప్రశ్నించారు. పోలీసులపై దాడి చేసే వారికి కూడా రాజకీయ రంగు పులమటం ఏంటని నిలదీశారు.

ys-jagan-tenali-tour-becomes-political-controversy-details-here

కొద్ది రోజుల క్రితం తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులు మద్యం మత్తులో కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేశారు. పట్టణ సమీపంలో ముగ్గురు యువకులు కూర్చొని మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన కానిస్టేబుల్ ను పిలిచి అతనిపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ముగ్గురిని జాన్ విక్టర్, షేక్ బాబూలాల్, రాకేష్ గా గుర్తించారు. వీరంతా రౌడీ షీటర్ లడ్డూ అనుచరులుగా తేల్చారు. ఏకంగా కానిస్టేబుల్ పై దాడి చేయడాన్ని తీవ్ర నేరంగా భావించిన పోలీసులు వారి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు నడిరోడ్డు మీద లాఠీలతో తీవ్రంగా కొట్టిన వీడియో వైరల్ అయింది. అయితే పోలీసు లపై దాడి చేశారని, గంజాయి మత్తులో దారుణాలకు పాల్పడుతున్న వారికి బుద్ధి చెప్పాలని అంతా చూస్తుండగానే వారికి బుద్ధి చెప్పినట్లు చర్చ జరుగుతోంది.

కానిస్టేబుల్ పైన హత్యాయత్నా నికి పాల్పడిన వారికి మద్దతు తెలపటం పైనా కానిస్టేబుల్ సతీమణి ప్రశ్నిస్తున్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని ఆవేదన వ్యక్తం చేసారు. జగన్ ఈ ఘటన పైన ఘాటుగా స్పందించారు. వారిని రోడ్డుపై కూర్చోబెట్టవలసి వచ్చింది మరియు పదేపదే వారి కాళ్లపై లాఠీలతో కొట్టినట్లు వీడియోలో కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటన దాదాపు నెల రోజుల తరువాత బయటకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో భయం, బెదిరింపు లతో పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ దాడి మావన హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. ఇక, తెనాలి ఘటన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సమయంలో జగన్ పర్యటన రాజకీయ వివాదంగా మారే అవకాశంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+