అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీకా ఉత్సవం సక్సెస్‌- ఏప్రిల్‌ 14 కంట్రీ రికార్డ్‌- ప్రధానికి జగన్ థ్యాంక్స్‌

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టీకా ఉత్సవ్‌పై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఏపీ సీఎం వైఎస్‌ జగన్ కేంద్రానికి అండగా నిలిచారు. టీకా ఉత్సవ్‌ను విజయవంతం చేశామని, ఇందుకు కేంద్రం సహకారమే కారణమంటూ ప్రధాని మోడీకి థ్యాంక్స్‌ చెబుతూ ఓ లేఖ రాశారు. ఏప్రిల్ 14న అయితే దేశవ్యాప్తంగా అత్యధిక డోసులు ఇచ్చిన రాష్ట్రంగా రికార్డు సృష్టించామని ప్రధాని మోడీకి రాసిన లేఖలో జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో మరో 60 లక్షల డోసులు పంపాలని కోరారు.

 ఏపీ టీకా ఉత్సవ్‌ సక్సెస్‌

ఏపీ టీకా ఉత్సవ్‌ సక్సెస్‌

కేంద్రం ఈ నెల 11 నుంచి 14వ తేదీ మధ్య ప్రకటించిన టీకా ఉత్సవ్‌ వ్యాక్సిన్ల కార్యక్రమం ఏపీలో విజయవంతమైంది. ఆరంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా చివరికి వ్యాక్సినేషన్‌ స్పెషల్ డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తి చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్‌ ప్రధాని మోడీకి ఓ లేఖ కూడా రాశారు. ఇందులో టీకా ఉత్సవ్‌కు సహకరించినందుకు థ్యాంక్స్ కూడా చెప్పారు. ఈ నెల9న తేదీన నేను రాసిన లేఖకు స్పందనగా 6.4 లక్షల డోసులు పంపినందుకు మీకు కృతజ్ఞతలు అంటూ జగన్‌ ఇందులో పేర్కొన్నారు.

 ఏప్రిల్‌ 14న అత్యధిక డోసుల రికార్డు

ఏప్రిల్‌ 14న అత్యధిక డోసుల రికార్డు

దేశవ్యాప్తంగా ప్రకటించిన టీకా ఉత్సవ్‌ అమల్లో భాగంగా ఏపీలో ఏప్రిల్‌ 14న అత్యధికంగా 6.28 లక్షల డోసులు వేశామని సీఎం జగన్‌ ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. ఇది దేశంలోనే టాప్‌ అని కూడా గుర్తు చేశారు. దేశంలో టీకా ఉత్సవ్‌ సందర్భంగా మరే ఇతర రాష్ట్రం కూడా ఒక్క రోజులో ఇన్ని వ్యాక్సిన్లు వేయలేదన్నారు. రాష్ట్రంలో భారీ ఎత్తున చేపట్టిన టీకా ఉత్సవ్‌ డ్రైవ్‌ విజయవంతం కావడానికి కేంద్ర ప్రభుత్వ సహకారమే కారణమన్నారు.

వాలంటీర్లపై జగన్‌ ప్రశంసలు

వాలంటీర్లపై జగన్‌ ప్రశంసలు


కేంద్రం ప్రకటించిన టీకా ఉత్సవ్‌ ఏపీలో విజయవంతం కావడానికి వైసీపీ సర్కారు తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్ధే కారణమని సీఎం జగన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా వైసీపీ సర్కారు ప్రతీ 50 ఇళ్లకో వాలంటీర్‌ను నియమించిందని, వీరు వ్యాక్సిన్లు వేసేందుకు అర్హులైన వ్యక్తులను గుర్తించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని జగన్ తెలిపారు. ప్రతీ పీహెచ్‌సీ పరిధిలోని ఓ వార్డు లేదా గ్రామ సచివాలయంలో ఈ టీకా ఉత్సవ్‌ నిర్వహించినట్లు జగన్‌ పేర్కొన్నారు. తద్వారా ఈ టీకా ఉత్సవ్‌ను నిజమైన స్ఫూర్తితో నిర్వహించినట్లయిందని జగన్‌ తెలిపారు.

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్న జగన్

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్న జగన్

ప్రధానికి రాసిన లేఖలో వ్యాక్సినేషన్ల కార్యక్రమాన్ని ఏపీలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పిన సీఎం జగన్‌.. తద్వారా ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తమ స్ధాయికి మించి రోజుకు 6 లక్షలకు పైగా వ్యాక్సిన్లు వేస్తున్నట్లు జగన్ తెలిపారు. కానీ వ్యాక్సిన్ల కొరత కారణంగా ఈ కార్యక్రమాన్ని మరికొన్ని రోజులు కొనసాగించలేమని పేర్కొన్నారు. తగిన వ్యాక్సిన్ల నిల్వలు ఉంటే రాబోయే మూడు వారాల్లో వైరస్‌ బాధితులందరికీ వ్యాక్సిన్లు వేయాలన్న మీ ఉద్దేశం నెరవేరుతుందని ప్రధానికి తెలిపారు.

 60 లక్షల డోసులు కోరిన జగన్‌

60 లక్షల డోసులు కోరిన జగన్‌

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏపీలో 45 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ తొలి డోస్‌ వేయాలంటూ రాబోయే మూడు వారాల్లో 60 లక్షల డోసులు అవసరమని సీఎం జగన్‌ ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. కాబట్టి ఈ 60 లక్షల డోసులు ఏపీకి పంపేలా కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జగన్ ప్రధాని మోడీని కోరారు. ఈ సందర్భంగా కోవిడ్‌ నియంత్రణలో కేంద్రం తీసుకునే చర్యలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని జగన్ హామీ ఇచ్చారు.

English summary
andhra pradesh chief minister ys jagan on today wrote a letter to pm modi over success of tika utsav lasted recently. cm jagan thanked pm modi for extending central support to tika utsav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X