జగన్ కోర్టుకు హాజరు వేళ బిగ్ ట్విస్ట్, కీలక మలుపు..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ కేసుల్లో కీలక మలుపు. జగన్ పైన నమోదైన సీబీఐ కేసుల్లో ఆరేళ్లుగా కోర్టుకు హాజరు కాలేదు. కాగా, ఇప్పుడు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. దీంతో, తాను కోర్టుకు హాజరవుతానని చెప్పిన జగన్.. ముందుగా 21వ తేదీన వెళ్లాలని భావించారు. అయితే, అనూహ్యంగా రేపు (గురువారం) హాజరు కావాలని నిర్ణయించారు.

మాజీ సీఎం జగన్ రేపు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఎదుట హాజరు కానున్నారు.గత ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకాలేదని, ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన భౌతికంగా హాజరుకావడం తప్పనిసరని సీబీఐ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, నవంబర్ 21లోగా వ్యక్తిగతంగా హాజరుకావాలని జగన్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో, గడువుకు ఒకరోజు ముందే ఆయన కోర్టుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. జగన్ చివరి సారిగా ముఖ్యమంత్రి హోదాలో 2020, జనవరి 10న విచారణకు హాజరయ్యారు. అయితే.. జగన్‌ లండన్‌ వెళ్లిన సమయంలో ఫోన్‌ నంబరు తప్పుగా ఇవ్వడంతో.. జగన్‌ కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది.

ys-jagan-to-appear-in-cbi-court-on-20th-in-disproportionate-assets-case

తన వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్‌ తరఫు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతా రని తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు కోర్టు సమయం ఇవ్వగా.. అదే రోజున న్యాయస్థానానికి జగన్‌ వస్తారని న్యాయవాది వెల్లడించారు. దీంతో, ఆరేళ్ల తర్వాత ఆయన కోర్టు మెట్లు ఎక్కనున్నారు. తన పైన నమోదైన కేసుల్లో జగన్ సీఎం అయిన తరువాత ఒక్క సారి మాత్రమే కోర్టుకు వెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2019 మార్చిలో ఆయనకు కోర్టుకు వెళ్లారు. గత నెలలో జగన్‌ అభ్యర్థనతో యూరప్‌ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇక.. ఇప్పుడు న్యాయస్థానం ముందు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేయటంతో రేపు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో.. విచారణలో ఈ పరిణామం కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+