అసెంబ్లీకి వైఎస్ జగన్, పక్కా ప్లాన్‌తో ఎంట్రీ
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడంపై వైసీపీ కీలక ఆప్డేట్ ఇచ్చింది. బడ్జెట్ సమావేశాలకు పార్టీ అధినేత జగన్‌తో పాటు, ఎమ్మెల్యేలు సైతం హాజరుకానున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.అధికారం కోల్పోయిన తర్వాత జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కేవలం శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేసేందుకు మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ పూర్తి దూరంగా ఉంది.
తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని.. సాధారణ ఎమ్మెల్యేగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమని జగన్ పేర్కొంటూ వస్తున్నారు.ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తామని జగన్ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.అయితే కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టనుండటంతో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని భావిస్తున్నారు.

ఎన్నికల సమయంలో భారీ హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం , ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడానికి నిధులు లేవని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సూపర్ సిక్స్ అమలు సాధ్యంపై చంద్రబాబు సైతం అసెంబ్లీలోనే తేల్చేశారు. దీంతో బడ్జెట్‌లో సూపర్ సిక్స్ అమలు , వాటి కేటాయింపులపై నిలదీయడానికే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్‌తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సోమవారం అసెంబ్లీకి హాజరుకానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications