YS Abhishek Reddy: నేడు జగన్ తమ్ముడి అంత్యక్రియలు..!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని వైఎస్సార్ జిల్లా పులివెందులకు తరలించారు. అక్కడే ఇవాళ అభిషేక్ రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.

దీనికి హాజరయ్యేందుకు వైఎస్ జగన్ పులివెందులకు బయలుదేరి వెళ్లారు. తమ్ముడికి నివాళులు అర్పించడంతో పాటు అంత్యక్రియల్లోనూ జగన్ తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొంటారు.

ys jagan to attend brother ys abhishek reddy s last rites in pulivendula today

వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్ కు కజిన్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడు. వైఎస్ మదన్ మోహన్ రెడ్డి కుమారుడు. గతంలో వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కూడా అభిషేక్ రెడ్డి పనిచేశారు. గత ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున అభిషేక్ రెడ్డి ప్రచారం చేశారు. అయితే ఆ తర్వాత ఆయన అనారోగ్యం పాలయ్యారు. దీంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా అభిషేక్ రెడ్డి ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

అభిషేక్ రెడ్డి మృతితో పులివెందులలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అలాగే వైఎస్ కుటుంబంలోనూ విషాదం నెలకొంది. అభిషేక్ రెడ్డి మృతి విషయం తెలియగానే వైఎస్ కుటుంబ సభ్యులంతా పులివెందుల చేరుకుంటున్నారు. షర్మిల మినహా మిగిలిన వారంతా వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. అభిషేక్‌రెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి పులివెందులకు తెచ్చి జనం సందర్శన కోసం ఉంచారు. మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. మరోవైపు అభిషేక్ రెడ్డి మృతదేహానికి పార్టీలకు అతీతంగా నాయకులు నివాళులు అర్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+