అంబటి కోసం రంగంలోకి జగన్, కీలక నిర్ణయం..!!
అంబటి రాంబాబు వ్యవహారం కీలక మలుపు తీసుకుంటోంది. మాజీ మంత్రి అంబటి గుంటూరు లో ముఖ్యమంత్రి చంద్రబాబు పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో టీడీపీ నేతలు మండిపడ్డారు. అంబటిని టార్గెట్ చేసారు. గుంటూరు రాంబాబు ఇంటి వద్ద అనూహ్య ఘటనలు చోటు చేసుకు న్నాయి. అంబటి ఇంటి పైన జరిగిన దాడిని మాజీ సీఎం జగన్ ఖండించారు. ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన పైన పార్టీ నేతలతోనూ మాట్లాడారు.
అంబటి రాంబాబు వివాదం పైన మాజీ సీఎం జగన్ స్పందించారు. గుంటూరు జిల్లా నేతలతో మాట్లాడారు. పార్టీ నేతలు రాంబాబుకు మద్దతుగా వెళ్లాలని సూచించారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబుతో పాటుగా గవర్నర్, కేంద్ర హోం శాఖను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసారు. అందులో చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజ్‌గా మారిపోయిందని వైయస్ జగన్ మండిపడ్డారు. తన దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యా యత్నాలు, దాడులకు దిగుతున్నారని, తిరుమల లడ్డూ ప్రసాదం పేరుతో చంద్రబాబు చేసిన కుట్ర విఫలమవడంతో భంగపడి వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాంబాబుపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ, ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని పేర్కొన్నారు.ఈ ఘటన ను గవర్నర్, కేంద్ర హోం శాఖకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు.

పార్టీ నేతలతో కీలక భేటీ
పార్లమెంట్ సమావేశాలు జరగుతున్న వేళ.. ఢిల్లీలో ఎంపీలు ఈ ఘటన పై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్దేశించారు. అదే విధంగా ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్... ఏపీకి రాగానే నేరుగా గుంటూరు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. రాంబాబు పైన ప్రస్తుతం మూడు కేసులు నమోదయ్యాయి. రాంబాబుకు రిమాండ్ విధిస్తే జైలుకు వెళ్లి పరామర్శించాలని... ముందుగా అంబటి కుటుంబ సభ్యులను కలవాలని డిసైడ్ అయ్యారు.
ఇదే సమయంలో ఈ రోజు వైయస్సార్‌సీపీ ముఖ్యనేతలు అంబటి కుటుంబాన్ని పరామర్శించ నున్నారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, విడదల రజని, మాజీ ఎంపీలు మోదుగుల, నందిగం సురేష్ తో పలువరు నేతలు అంబటి నివాసానికి వెళ్లనున్నారు. గుంటూరు జిల్లా నేతలను సోమవారం అందుబాటు లో ఉండాలని జగన్ నిర్దేశించారు. అంబటి ఇంటి పైన జరిగిన దాడి విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్లాలో కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications