మిథున్ పై మారిన జగన్ ఆలోచన, కీలక నిర్ణయం..!!

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు వైసీపీ నేతలు పలు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ముఖ్య నేతలను జైలులో జగన్ పరామర్శించారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని మాత్రం పరామర్శించ లేదు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ మిథున్ రెడ్డిని ఈ నెల తొలి వారంలోనే జగన్ పరామర్శిస్తారని పార్టీ నేతలు వెల్లడించారు. అయితే, జగన్ పరామర్శకు వెళ్లలేదు. కాగా, ఇప్పుడు లిక్కర్ కేసులో రిమాండ్ లో ఉన్న మిథున్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

కొద్ది కాలంగా జగన్ జిల్లాల పర్యటనలు వివాదాస్పదం అవుతున్నాయి. జగన్ పర్యటనల వేళ ఆంక్షల విధింపు.. వైసీపీ నేతల జన సమీకరణ ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. జైలులో ఉన్న వైసీపీ నేతలను జగన్ పరామర్శిస్తున్నారు. జగన్ పర్యటనల వేళ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. జగన్ పర్యటనల ను వైసీపీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. భారీగా జనం వస్తుండటం తో తమ బలం ఏంటో నిరూపించుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అటు పోలీసులు సైతం ఆంక్షలు ఉల్లంఘించిన వారి పైన కేసులు నమోదు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు జగన్ కూటమికి కంచుకోటగా ఉన్న తూర్పు గోదావరి పర్యటనకు సిద్దమయ్యారు. ఈ నెల 25న రాజమండ్రి జైలులో మిథున్ పరామర్శకు జగన్ నిర్ణయించారు.

ys-jagan-to-console-mp-mithun-reddy-in-rajahmundry-jail-on-25th

గత నెల 20న అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో స్నేహా బ్లాక్ లో ఉన్నారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ సమయం లోనూ ఇదే బ్లాక్ లో ఉన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ను జగన్ ఇప్పటికే ఖండించారు. అసలు లిక్కర్ వ్యవహారాలతో మిథున్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. కాగా, జగన్ రాజమండ్రి పర్యటనకు వస్తున్న వేళ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ముఖ్య నేతలు రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించారు. లిక్కర్ కేసులో వాస్తవాలు లేవని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రానున్న రోజుల్లో నష్టపోతారని మాజీ మంత్రి బొత్సా హెచ్చరించారు.

ఇక, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని జగన్ ఇప్పటి వరకు పరామర్శించకపోవటం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. ఈ సమయంలోనే జగన్ మిథున్ రెడ్డిని పరామర్శించాలని నిర్ణయించారు. అదే విధంగా మాజీ మంత్రి కన్నబాబు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. కాకినాడలో ఈ ఉదయం కన్నబాబు తండ్రి అస్వస్థతో కన్నుమూసారు. ఇప్పుడు కూటమికి కంచు కోటగా ఉన్న తూర్పు గోదావరికి జగన్ వస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో, ఇప్పుడు రాజమండ్రి పర్యటన పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+