అరెస్ట్ ల వేళ కొత్త ట్విస్ట్, గవర్నర్ తో జగన్ కీలక భేటీ - నెక్స్ట్ ఇక..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నేతల పైన వరుస కేసులు.. అరెస్ట్ ల వేళ జగన్ తన వ్యూహం మార్చారు. కూటమి ప్రభుత్వం టార్గెట్ గుర్తించిన జగన్ కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్న జగన్ ఈ సాయంత్రం గవర్నర్ తో భేటీ కావాలని డిసైడ్ అయ్యారు. ఆయనతో కీలక చర్చలు చేయనున్నారు. ఇదే సమయంలో జగన్ కొత్త కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దమయ్యారు. జగన్ తాజా నిర్ణయాల వేళ గవర్నర్ తో భేటీ కీలకంగా మారుతోంది.
కీలక భేటీ
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ సాయంత్రం గవర్నర్ తో భేటీ కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే అప్పాయింట్ మెంట్ ఖరారైంది. ప్రస్తుతం లిక్కర్ కేసు విచారణ.. అరెస్టులు.. ఛార్జ్ షీట్ లో జగన్ పేరు ప్రస్తావనతో రాజకీయంగా ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది. సిట్ త్వరలోనే పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు నేతలను సిట్ అరెస్ట్ చేసింది. కాగా, ఈ కేసు లో సిట్ చేస్తున్న అభియోగాల ను జగన్ ఇప్పటికే తోసి పుచ్చారు. ఇక..తన జిల్లాల పర్యటనల వేళ ఆంక్షలు.. కేసుల నమోదు అంశం పైన జగన్ ఈ భేటీలో గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

గవర్నర్ కు ఫిర్యాదు
వైసీపీ నేతలు.. కేడర్ ను కేసుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని జగన్ ఫిర్యాదు చేసేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. ఇక, రేపు (మంగళవారం) జగన్ పార్టీ పీఏసీ సమావేశం నిర్వహణకు నిర్ణయించారు. ఈ భేటీలో రానున్న రోజుల్లో కేసుల కారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా.. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాల పైన నిరసనలకు కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఆగస్టు 15 నుంచి జగన్ జిల్లాల వారీగా పార్టీ కేడర్ తో మమేకం అయ్యేందుకు జిల్లాల పర్యటనలు ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపు జరిగే సమావేశం లో నిర్ణయం తీసుకోనున్నారు.
నెల్లూరు - రాజమండ్రికి
ఈ నెల 31న జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్నారు. అక్కడ నుంచి సీనియర్ నేత ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి జగన్ వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు చేసారు. వచ్చే నెల 5న రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించాలని జగన్ డిసైడ్ అయ్యారు. కాగా, జగన్ నెల్లూరు పర్యటన వేళ కొద్ది రోజుల క్రితం హెలిప్యాడ్ అనుమతుల విషయంలో చర్చ జరిగింది. ఈ విషయంలో వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారు. కాగా, అప్పుడు జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు జగన్ నెల్లూరు పర్యటన వేళ మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో.. గవర్నర్ తో జగన్ భేటీ వేళ చర్చించే అంశాలు.. రాజకీయంగా రానున్న రోజుల్లో తీసుకునే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications