మేనిఫెస్టోలో మార్పులు, రైతుల కోసం - జగన్ కీలక హామీలు..!!
ఏపీలో ఎన్నికల పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. నామినేషన్ల ఘట్టం పూర్తి కావటంతో..మేనిఫెస్టోల పైన పార్టీలు ఫోకస్ చేసాయి. జగన్ ఈ నెల 28వతేదీ నుంచి ఎన్నికల మలి విడత ప్రచారం ప్రారంభించేలా షెడ్యూల్ ఫిక్స్ అయింది. రేపు (శనివారం) తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. మారుతున్న లెక్కలతో జగన్ మేనిఫెస్టోలో చివరి నిమిషంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ఓట్ బ్యాంక్ పైన జగన్ గురి పెట్టారు.
వైసీపీ మేనిఫెస్టో
ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 27న ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో పైన పార్టీ ముఖ్యులతో చర్చలు చేసారు. జగన్ బస్సు యాత్రలో వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా మేనిఫెస్టో ఖరారు చేసారు. అయితే, ఈ రోజునే తొలుత మేనిఫెస్టో విడుదల చేయాలని భావించారు. కానీ, రాజకీయంగా మారుతున్న లెక్కలు, ఓట్ బ్యాంక్ ను పరిగణలోకి తీసుకొని చివరి నిమిషంలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా జగన్ తన మేనిఫెస్టోల కీలక హామీలకు సిద్దం అవుతున్నారు. నవరత్నాలను కొనసాగిస్తూనే కొన్నింటి పరిధి పెంచేలా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ మేనిఫెస్టో నవరత్నాలకు మించి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఎన్నికల హామీలు
2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను 99 శాతం అమలు చేసామని పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ బస్సు యాత్ర సమయంలో ప్రధానంగా రైతు రుణ మాఫీ గురించి ఎక్కువ మంది నుంచి వినతులు అందాయి. అయితే, జగన్ రుణమాఫీ పైన తన నిర్ణయం ఏంటనేది బయట పెట్టలేదు. చెప్పేదే చేస్తామని స్పష్టం చేసారు. అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ వర్గాల సమాచారం. అదే సమయంలో మహిళా ఓట్ బ్యాంక్ ను జగన్ ప్రధానంగా నమ్ముకున్నారు. దీంతో..రైతు రుణ మాఫీ అమలు చేస్తే ఎంత మొత్తం వరకు ప్రకటిస్తారు..రుణమాఫీ పైన స్పష్టత ఇస్తారా.. ఇతరత్రా రైతులకు ప్రయోజనం కలిగే హామీలను ప్రకటిస్తారా అనేది స్ఫష్టత రావాల్సి ఉంది.

గేమ్ ఛేంజర్ కానుందా
అదే విధంగా మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు చంద్రబాబు సూపర్ సిక్స్ ప్రకటించారు. వీటికి ధీటుగా జగన్ హామీలు ఉంటాయా లేదా అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చ. ఇక..జగన్ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రచార యాత్ర ప్రారంభించనున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు, 29న.. చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు, 30న కొండెపి, మైదుకూరు, పీలేరు, మే1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మేనిఫెస్టో ప్రకటన తరువాత ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా తన హామీలను జగన్ ప్రస్తావించనున్నారు. దీంతో..జగన్ ప్రకటించే మేనిఫెస్టో...వరాలు...ఇప్పుడు ఎన్నికల వేళ గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం కనిపిస్తోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications