వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు కోనసీమలో గోదావరి వరద బాధితులకు జగన్ వరామర్శ-షెడ్యూల్ ఇదే

|
Google Oneindia TeluguNews

ఏపీలో గోదావరి వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రతీ ఏటా కంటే ముందుగా గోదావరి నదికి వచ్చిన తీవ్ర వరదలు పోలవరంతో పాటు గోదావరి జిల్లాల్లో లంక గ్రామాల్ని ముంచేశాయి. దీంతో భారీ ఎత్తున జనం ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఇప్పటికే ప్రభుత్వం తరఫున సాయం అందిస్తున్న సీఎం జగన్.. రేపు నేరుగా వారిని వరామర్శించేందుకు వెళ్తున్నారు.

రేపు గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారు.
ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 10.30 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుంటాకరు. అక్కడి నుంచి 11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు.

ys jagan to visit godavari flood victims in konaseema district tomorrow, here is schedule

అనంతరం సీఎం జగన్ అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం వెళతారు. అక్కడ వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం 4.05 గంటలకు తిరిగి రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి అక్కడే బస చేస్తారు. ఎల్లుండి ఉదయం పరిస్దితిని సమీక్షించిన తర్వాత తాడేపల్లికి తిరిగొస్తారు.

English summary
ap cm ys jagan to visit godavari flood affected areas in konaseena district tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X