జగన్ భారీ ప్లాన్, ఆ నియోజకవర్గాలపై అనూహ్య నిర్ణయం - ఒంగోలు నుంచి మొదలు..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించిన జగన్.. పార్టీ పరంగా నిరసనలు నిర్వహించారు. గత ఏడాదిలోనే జిల్లాల పర్యటన కు వెళ్లాలని భావించినా.. వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు జగన్ కొత్త ప్లాన్ తో సిద్దం అయ్యారు. పార్టీ ముఖ్య నేతలతో కీలక మంత్రాంగం కొనసాగుతోంది. జగన్ వ్యూహాత్మకంగా కొన్ని నియోజక వర్గాలను ఎంపిక చేసారు. అక్కడ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ చేసారు. అదే విధంగా కేసులు నమోదైన నేతల విషయంలోనూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మాజీ సీఎం జగన్ పర్యటనలకు సిద్దం అవుతున్నారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ప్రస్తుతం పరిస్థితుల పైన సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. వీటి ఆధారంగా పార్టీలోని ముఖ్య నేతలతో మాట్లాడారు. ఈ నెల చివరి వారం నుంచి ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పర్యటన చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం గోదావరి జిల్లాలను ముందుగా ఎంపిక చేసుకున్నారు. అదే విధంగా పార్టీ ఎన్నికల్లో ఓడిన తరువాత వైసీపీ వీడిన నేతల నియోజకవర్గాల్లోనూ జగన్ వరుస పర్యటనలకు షెడ్యూల్ సిద్దం చేస్తున్నారు.

ys-jagan-to-visit-selected-constituencies-in-next-month-to-begin-from-ongole

ఈ సారి జగన్ గోదావరితో పాటుగా ఉత్తరాంధ్ర పైన స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. అక్కడి పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. తొలి పర్యటన తూర్పు గోదావరి నుంచి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. పార్టీ కేడర్ తో ఈ నియోజకవర్గాల్లో జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వారి సమస్యలను వినటంతో పాటుగా.. స్పష్టమైన హామీలు ఇవ్వనున్నారు.

అదే విధంగా కేసులు ఎదుర్కొంటున్న పార్టీ నేతల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసులు ఎదుర్కొంటున్న నేతల నియోజకవర్గాల్లోనూ జగన్ పర్యటించి.. ప్రభుత్వం వేధింపుల్లో భాగంగా కేసులు నమోదు చేస్తుందని.. కేడర్ కు పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు పార్టీ నేతల సమాచారం.

అందులో భాగంగా వంశీ, జోగి రమేశ్, పేర్ని నాని, పిన్నెళ్లి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి నేతల నియోజకవర్గాలకు వెళ్లనున్నారు.ఒంగోలు, గన్నవరం, మైలవరం నియోజవకవర్గాల్లో సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన జగన్ పార్టీ ముఖ్య నేతలతో తాడేపల్లిలో భేటీ కానున్నారు. ఆ సమావేశంలో ఈ పర్యటన.. సభలకు సంబంధించి అధికారికంగా ముహూర్తం ఖరారు కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+