పాదయాత్ర ముగిసింది. అసలు కధ ఆరంభం : జమ్మలమడుగు నుండే మొదలు..!
పాదయాత్ర తరువాత వైసిపి అధినేత జగన్ సొంత జిల్లాకు వస్తున్నారు. కడప జిల్లాలో జగన్ పర్యటన తొలిగా పులివెం దుల ఆ తరువాత వైయస్ సమాధికి నివాళి అర్పిస్తారు. ఇక, కడప జిల్లా నుండే సార్వత్రిక ఎన్నికలకు కార్యాచరణ ఖ రారు చేయటం తో పాటుగా అభ్యర్దుల ప్రకటన మొదలు పెట్టనున్నట్లు సమాచారం. సంక్రాంతి పండుగ రోజుల్లో జగన్ తన అభ్యర్ధుల ఖరారు తో పాటుగా కొన్ని ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది.

ముగిసిన పాదయాత్ర.. సొంత జిల్లాకు..
సుదీర్ఘ విరామం తరువాత జగన్ సొంత జిల్లాలో..తన నియోకవర్గంలో కాలు పెడుతున్నారు. తిరుమలేశుని దర్శనం పూర్తయిన తరువాత శుక్రవారం సాయంత్రం కడప దర్గాను జగన్ దర్శించుకోనున్నారు. ఆ తరువాత పులివెందులకు చేరుకుంటారు. 12న ఇడుపులపాయలో వైయస్ సమాధికి నివాళి అర్పిస్తారు. ఆ తరువాత పులివెందుల చర్చిలో ప్రార్ధ నలు నిర్వహించి రెండు రోజుల పాటు పులివెందుల లోనే ఉంటారు. ఇక, సొంత జిల్లాలో రాజకీయ పరిస్థితుల పై జగన్ ఇప్పటికే నివేదిక కోరినట్లు సమాచారం. జగన్ పాదయాత్ర చేసిన 14 నెలల్లో జిల్లాలో రాజకీయాల పై పెద్దగా దృష్టి పెట్టలేకపోయారు. దీంతో..ఇప్పుడు జిల్లాలోని పరిస్థితుల అధ్యయనం తో పాటుగా తాను చేయించిన సర్వేల వివరాలను జగన్ జిల్లా పార్టీ నేతలతో సమీక్షించనున్నారు.

కడప జిల్లాలో టిడిపికి అవకాశం ఇవ్వకుండా..
జగన్ పాదయాత్ర లో ఉన్న సమయంలో కడప జిల్లాలో టిడిపి కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఎలాగైనా కడప లో సత్తా చాటుకోవాలని టిడిపి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక, 2014 ఎన్నికల్లో తొమ్మిది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. జమ్మలమడుగు, బద్వేలు వైసీపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, జయరాములు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లో సుధీర్‌రెడ్డి, డాక్టర్ వెంకటసుబ్బయ్యలను ఇన్‌చార్జిలుగా పెట్టారు. రాజంపేటకు ఇన్‌చార్జిగా ఆకేపాటి అమరనాథరెడ్డి కొనసాగుతున్నారు. మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే పార్టీ ఇన్‌చార్జిలుగా కొనసాగుతుండగా పులివెందులలో మాజీ ఎంపీ అవినాష్ ఆ బాధ్యతలు చూస్తున్నారు. కడప ఎంపీ స్థానం నుండి పోటీ చేసేందుకు మంత్రి ఆదినారాయణ రెడ్డిని టిడిపి ఒప్పంచే ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ కూడా వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతూ ఈసారి కడప లోక్‌సభ అభ్యర్థి మార్పు ఉంటుందని పార్టీలో చర్చ సాగుతోంది. వైఎస్ కుటుంబంలోనే ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉందని అవినాష్‌కు ఎక్కడైనా ఎమ్మెల్యేగా అవకాశమిస్తారని సమాచారం. జమ్మలమడుగు నుండి ఎంపి అవినాశ్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది.

బస్సు యాత్ర పై ప్రకటన..అభ్యర్ధుల ఖరారు పైనా..
పాదయాత్ర ముగించిన జగన్..ఇప్పుడు ఆసలు ఆట ప్రారంభిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి దాదాపు కీలక నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎవరనేది ఇప్పటికే జగన్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఇక, పాదయాత్ర సమయంలో జిల్లాల వారీగా..నియోజకవర్గాల వారీగా జగన్ ఓ అంచానకు వచ్చారు. ఇక, సర్వేల ద్వారానూ తనకు కావాల్సిన సమాచారం సేకరించారు. ఇప్పుడు అభ్యర్ధుల ప్రకటన పై జగన్ దృష్టి సారించారు. టిడిపి వేసే ఎత్తుగడలను జాగ్రత్తగా పరిశిలిస్తూ అడుగులు వేయాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా..ముందుగా కడప జిల్లాలో పట్టు సాధించామని..తమకు తిరుగులేదని టిడిపి చెబుతున్న పరిస్థితుల్లో జగన్ పులివెందులలో మకాం వేస్తున్నారు. ముందుగా సొంత జిల్లాకే చెందిన అభ్యర్ధుల ఖరారు ద్వారా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధలు ప్రకటన మొదలు పెట్టాలని భావిస్తున్నారు. కడప జిల్లా లో జమ్మలమడుగు విషయం లో జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. సంక్రాంతి పండుగ రోజుల్లో జగన్ చేయబోయే రాజకీయ ప్రకటనలు ఎన్నికలకు కీలకం కానున్నాయి.












Click it and Unblock the Notifications