వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Jagan vs Sharmila: అన్నా..చెల్లెలు ఒకే వేదిక మీదకు..అభిమానుల్లో సెంటిమెంటల్ ఎమోషన్...!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ఇది వైఎస్ కుటుంబం. అన్నా - చెల్లెల మధ్య విభేదాలు అనేది అబద్దం. వారిని విడదీయటం ఎవరితోనూ సాధ్యం కాదు. ఇది షర్మిల - జగన్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ ఒక వర్గం మీడియా ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేస్తుందంటూ తల్లి విజయమ్మ విడుదల చేసిన లేఖలో చెప్పుకొచ్చిన విషయాలు. షర్మిల పొలిటికల్ ఎంట్రీ సమయంలోనూ తాను పార్టీ పెడుతున్న విషయం అన్నకు తెలుసని చెబుతూనే ..రాఖీ పండుగకు వెళ్లటం...అన్నా - చెల్లెలుగా బంధం ఉండిపోతుందని స్పష్టం చేసారు.

Recommended Video

#TopNews : AP Exams - ప్రభుత్వానికి ,పేరెంట్స్ కి మధ్య Communication Gap | Oneindia Telugu

అయితే, తనకు వైసీపీలో ఎందుకు ప్రాధాన్యత దక్కలేదో జగన్ చెప్పాలని షర్మిల వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జగన్ ప్రభత్వ సలహాదారు సజ్జల స్పందించారు. జగన్ - షర్మిల మధ్య బేదాభిప్రాయాలు లేవని..ఉన్నది కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయంలో జగన్ వద్దన్నారని స్పష్టం చేసారు. దీని ద్వారా జగన్ కు తన సోదరి తెలంగాణలో పార్టీ ఏర్పాటు ఇష్టం లేదనే విషయాన్ని స్పష్టం చేసారు.

 అన్న ప్రభుత్వాన్ని షర్మిలా ప్రశ్నిస్తుందా..?

అన్న ప్రభుత్వాన్ని షర్మిలా ప్రశ్నిస్తుందా..?

అన్న ఏపీలో తన పని తాను చేసుకుంటాడు..నా పని నేను తెలంగాణలో చేసుకుంటానంటూ షర్మిల తేల్చి చెప్పారు. దీంతో పాటుగా తెలంగాణకు అన్యాయం జరిగితే తాను తన అన్న ప్రభుత్వాన్నైనా ప్రశ్నిస్తానని చెప్పుకొచ్చారు. ఇక, ఆ తరువాత షర్మిల ఖమ్మంలో ఏర్పాటు చేసిన సభలోనూ..ఉద్యోగ దీక్షలోనూ తల్లి విజయమ్మ కుమార్తె వెంటే ఉన్నారు. ఇక, ఇప్పుడు వైఎస్సార్టీపీ ఏర్పాటుకు సంబంధించి తమకు అభ్యంతరం లేదంటూ వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు. జూలై 8న పార్టీ అధికారికంగా ప్రకటిస్తానని ఈ రోజు జరిగిన పార్టీ ఏర్పాటు సన్నాహక సమావేశంలో షర్మిల వెల్లడించారు. అయితే, గత డిసెంబర్ నుండే తెలంగాణలో తన రాజకీయ ఎంట్రీ గురించి షర్మిల సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రతీ ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ కుటుంబ సభ్యులంతా కలిసి పులివెందులలో జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. కానీ, గత డిసెంబర్ లో షర్మిల పులివెందుల రాలేదు. జగన్ మాత్రం అక్కడకు వెళ్లారు.

 ఒకే వేదికపై జగన్ - షర్మిలా

ఒకే వేదికపై జగన్ - షర్మిలా

ఇక, ఇప్పుడు వచ్చే నెల జూలై 8న వైఎస్సార్ జన్మదినం. ఆ రోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన తండ్రికి నివాళి అర్పించేందుకు ఇడుపుల పాయకు వెళ్తారు. ఈ సారి మరో ప్రత్యేకత ఉంది. తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్న షర్మిల పూర్తగా వైఎస్సార్ పాలన..ఆయన అభిమానుల పేరును ప్రతీ సందర్బంలో ప్రస్తావిస్తున్నారు. తన తండ్రి పేరుతో పెట్టే పార్టీ కావటంతో జూలై 8న ఇడుపుల పాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించి..పార్టీ ప్రకటనకు బయల్దేరుతారని విశ్వసనీయ సమాచారం. దీంతో..అక్కడ కొంత గ్యాప్ తరువాత జగన్..షర్మిల కుటుంబ సభ్యుల సమక్షంలో ఒకే వేదిక మీదకు రానున్నారు. అందునా తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద ఆయన జన్మదినం నాడు కలవనున్నారు. ఇప్పుడు ఇదే అంశం రెండు రాష్ట్రాల్లోని వైఎస్సార్.. జగన్..షర్మిల అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు ఒకే చోటకు వస్తే..జరిగిన-జరుగుతున్న ప్రచారాలన్నింటికీ ఒకటే సమాధానం అన్నట్లుగా నాటి ఆప్యాయతలతో కనిపిస్తారా అనేదే ఇప్పుడు వారిని అభిమానించే వారిలో ఒక ఆసక్తి కర అంశంగా మారుతోంది.

 అన్నా చెల్లెల కోసం అభిమానులు వెయిటింగ్

అన్నా చెల్లెల కోసం అభిమానులు వెయిటింగ్

గతంలో 2019 ఎన్నికల సమయంలో పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను జగన్ అక్కడి నుండే ప్రకటించారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినా... జగన్ క్యాంపు నుండి ఇప్పటి వరకు ఎక్కడా వ్యతిరేక వ్యాఖ్యలు లేవు. జగన్ జైల్లో ఉన్న సమయంలోనూ... 2019 ఎన్నికల ప్రచారం వరకూ తన అన్న కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారనే విషయాన్ని ప్రతీ జగన్ అభిమాని మర్చి పోలేరు. తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర... 2012లో జరిగిన ఉప ఎన్నికల కోసం తల్లితో ప్రచార బాధ్యతలు...2019 ఎన్నికల్లోనూ బైబై బాబు నినాదంతో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన అంశాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. దీంతో..వైఎస్సార్ మరణం నుండి సెంటిమెంటల్ రిలేషన్ తో జగన్ అభిమానులతో అటాచ్ మెంట్ పెరిగిపోయింది. ఇక, ఇప్పుడు తాజా పరిస్థితుల్లో అన్నా చెల్లెలు ఇద్దరూ ఒకే చోటకు వస్తుండటంతో...ఇంకా సమయం ఉన్నా..అప్పుడే ఆ రోజు కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

English summary
AP CM Jagan and his sister YS Sharmila may meet on same dias after a gap. On July 8th sharmila decided to announce her new party officially after paying homage to her father in idupula paya. on the same day jagan also participating same programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X