మేమూ అధికారంలోకొస్తాం... చూస్కోండి: అనంత పోలీసులకు జగన్ వార్నింగ్

అమరావతి: అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర ఆదివారంతో ముగిసింది. రైతు భరోసా యాత్ర ఆరంభం నుంచి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన వైయస్ జగన్ ఆదివారం అనంతపురం జిల్లా పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు.

అధికార పార్టీ టీడీపీకి వత్తాసు పలుకుతున్న పోలీసులు తమ పార్టీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వాలు మారుతుంటాయన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రభుత్వమే పట్టపగలు ఖూనీలు చేసే స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు.

 ys jagan warns to anantapur police in rythu bharosa yatra

రాప్తాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జీ ప్రకాశ్ రెడ్డిని చంపాలని చూశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పాలన ఎల్లకాలం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులు మానవతా దృక్పథంతో పనిచేసి న్యాయాన్ని కాపాడాలని అన్నారు. ''ప్రభుత్వాలు మారుతుంటాయి. మేమూ అదికారంలోకి వస్తాం. చూస్కోండి" అని జగన్ పోలీసులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

చంద్రబాబు పాలన ఎల్లకాలం ఉండదని చెప్పిన జగన్ జీతాలిస్తున్నది చంద్రబాబు కాదని.. ప్రభుత్వం చెల్లిస్తోందన్న విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి'' అని అన్నారు. అంతక ముందు ఓబుళదేవరచెరువు మండలం వడ్డివారిపల్లిలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం వైఎస్ఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 'ఎన్నికలకు ముందు చంద్రబాబు పలు హామీలు ఇచ్చారు.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేదు.. సీమ భాషలో అలాంటి మోసగాళ్లను చెప్పులతో కొట్టాలనంటాం... అయితే ఆ మాట నేనడం లేదప్పా... బాబుకు చెప్పు ఇష్టం లేదట.. ఈసారి చీపుర్లు చూపించండి' అని అన్నారు.

ఆ తర్వాత డబురువారిపల్లి, కొండకమర్ల, నల్లమాడ, నల్లశింగయ్యగారిపల్లి, మలకవేమల క్రాస్‌ మీదుగా భరోసా యాత్ర ముదిగుబ్బ మీదుగా జగన్‌ అనంతపురం చేరారు. సాయంత్రం అక్కడి అంబేద్కర్‌ కూడలిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

 ys jagan warns to anantapur police in rythu bharosa yatra

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇచ్చిన మాట కోసం నిలబడాలని అన్నారు. అప్పుడే రాజకీయాలకు విశ్వసనీయత వస్తుందని, అది దివంగత వైఎస్‌కే చెల్లిందని అన్నారు. విశ్వసనీయతకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. మోసాలు చేసేవారిపైన, పిక్‌పాకెట్‌కు పాల్పడే వ్యక్తులపైన 420 కేసులు నమోదు చేస్తారని, ఆయనపైనా అదే కేసు పెట్టాలన్నారు.

'వాగ్దానాలు నెరవేర్చకపోయినా నన్నెవడు అడుగుతాడు? ఎవరు ప్రశ్నిస్తారు? అనే అభిప్రాయంలో బాబు ఉన్నారు. 19 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.30 నుంచి రూ.40 కోట్లు పెట్టి కొన్నారు. ఈ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది? ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ప్రజల గొంతు మూగబోతుందని బాబు అనుకుంటున్నారు.

కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల చేత దమ్ముంటే రాజీనామా చేయించాలి. ఎన్నికలకు వస్తే ప్రజలే వారిని తరిమి కొడతారని అన్నారు. ఈ రెండేళ్లలో ఆయన ప్రజలను మోసగించడం తప్ప... చేసింది శూన్యం. అవినీతిలో నిండా మునిగిపోయారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ మంత్రులు రాజీనామా చేస్తారని అల్టిమేటం ఇవ్వలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారన్నారు.

రెండేళ్లలో తాను చేసిన అవినీతిపై సీబీఐతో ప్రధాని విచారణ చేయిస్తారనే భయంతోనే చంద్రబాబు నిలదీయడం లేదన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ను నిలదీయడం లేదు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఆయన చంద్రబాబుని జైల్లో పెడతారని భయంతోనేనని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+