జగన్ జైలుకెళ్తారు: కిషోర్, పరిటాల సునీత నిలదీత

గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ జైలుకు వెళ్లక తప్పదని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి రావెల కిషోర్‌ బాబు బుధవారం అన్నారు. వైయస్ హయాంలో కోట్ల రూపాయల విలువైన భూములను జగన్‌ బినామీ పేర్లతో అప్పనంగా పొందారని ఆరోపించారు.

సరస్వతీ భూముల వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేశామని, ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు, అనుచరులు పరారీలో ఉన్నారన్నారు. సరస్వతీ భూముల లీజు రద్దుకు గతంలోనే ప్రతిపాదనలు చేశామని, అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి సహకరించకుండా దోపిడీ, దుర్మార్గాలు చేస్తారా? అంటూ జగన్‌పై మండిపడ్డారు.

YS Jagan will go back to jail: Ravela Kishore

అవినీతి, కుంభకోణాలు, జైళ్లు, స్కామ్‌లతో నిండిన పార్టీ అన్నారు. ప్రజా వ్యతిరేక, ప్రజల సంపదను దోచుకున్నటు వంటి జగన్ పార్టీ ఇంకెంతకాలం మనగలుగుతుందో చెప్పలేమన్నారు. జగన్‌ తప్పకుండా జైలుకు వెళతారన్నారు.

సునీత నిలదీత

అనంతపురం జిల్లా ఆత్మకూరులో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతను తాగునీటి సమస్య పైన మహిళలు నిలదీశారు. ఆమె జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు పలువురు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు. త్వరలో బోరు వేయిస్తామని పరిటాల సునీత ఈ సందర్భంగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+