'రేపు రాష్ట్రాన్ని ఏలబోయే నాయకుడిపై విమర్శలా?'
న్యూఢిల్లీ: రేపు రాష్ట్రాన్ని ఏలబోయే తమ నాయకుడి పైన విమర్శలు చేయడం సరికాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి బుధవారం అన్నారు. లోకసభ వాయిదా అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. లోకసభలో పది రోజుల్లో ఒక్క సమస్యపై కూడా చర్చ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ సమైక్యత కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించాలని మెజార్టీ సభ్యులు కోరుతున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలకు వాడుతున్న భాష అఫ్రజాస్వామికమన్నారు.

అవిశ్వాసంపై పట్టుబడితే: మైసూరా
తమ పార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానం పైన పట్టుబడితే లోకసభను వాయిదా వేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి విమర్శించారు. లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత జగన్‌తో పాటు పార్టీ సభ్యులు సమైక్య నినాదాలు చేశారని, పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారన్నారు.
పార్లమెంటు సమావేశాలను మొక్కుబడిగా నడిపించారని మైసూరా ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌పాల్ బిల్లుకు మద్దతిస్తూ స్పీకర్‌కు తాము లేఖ ఇచ్చామన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణపై చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. ప్రభుత్వానికి సమస్యలపై చర్చించే చిత్తశుద్ధి లేదన్నారు. ఓట్లు, సీట్ల కోసమే విభజన అని ఆరోపించారు.












Click it and Unblock the Notifications