బాబును ఏకేసిన జగన్: భుజాలపై చేతులేసి (పిక్చర్స్)
విశాఖపట్నం: హుధుద్ తుఫాను తాకిడికి గురైన ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతాన్ని ఆయన శనివారంనాడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.
సహకార రంగంలో ఉన్న పంచదార కర్మాగారాలను నష్టాల్లోకి నెట్టి వాటిని సొంత మనుషులకు అమ్మేయడం చంద్రబాబు ప్రభుత్వానికి మామూలేనని ఆయన అన్నారు. తుఫాను సాయం అందుతున్న తీరుపై ఆయన బాధితులను అడిగి తెలుసుకున్నారు.
తుమ్మపాల చెరుకు రైతులు తమ గోడును జగన్‌కు విన్నవించుకున్నారు. తమ్మపాల పంచదార కర్మాగారం రైతులకు 6 కోట్ల రూపాయలు బాకీ పడితే ఇప్పటికీ కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని జగన్ అన్నారు. ఏడు నెలల నుంచి కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు.

చెరుకు రైతులతో జగన్
తుమ్మపాల పంచదార కార్మగారాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జగన్ విమర్శించారు.

చెరుకు రైతులతో జగన్
గతంలో కూడా 4 కోట్ల రూపాయలకు తుమ్మపాల కర్మాగారాన్ని అమ్మడానికి ప్రయత్నాలు జరిగాయని, ఆ ప్రయత్నాలను వైయస్ రాజశేఖర రెడ్డి అడ్డుకున్నారని జగన్ చెప్పారు.

చెరుకు రైతులతో జగన్
తుఫాను తాకిడి ప్రాంతాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన శనివారం కూడా సాగింది. ఆయన తుమ్మపాల గ్రామ బాధితులను పరామర్శించారు.

బాధితులకు జగన్ పరామర్శ
తుఫాను తాకిడికి గురైన విశాఖపట్నంలోని తుమ్మపాల బాధితుల భుజాలపై చేతులు వేసి జగన్ వారి కష్టాలను విన్నారు.

బాధితులతో జగన్
తుమ్మపాల చెరుకు రైతులు తమ గోడును వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు. తమకు రావాల్సిన బకాయిలు ఇంకా అందాల్సి ఉందని వారు చెప్పారు.

బాధితులను పరామర్శించిన జగన్
విశాఖపట్నం తుమ్మపాల గ్రామ బాధితులను జగన్ శనివారంనాడు పరామర్శించారు. పంచదార కర్మాగారం చెరుకు రైతుల గోడు విన్నారు.












Click it and Unblock the Notifications