చేయలేం, రూ.50వేలు ఇస్తాం: ఎమ్మెల్యేలకు యనమల, కొత్తగా.. జగన్ లేఖ
ఈసారి అసెంబ్లీ సమావేశాలలో ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సదుపాయాలు కల్పించలేమని, అందుకుగాను వారికి రూ.50వేలు చెల్లిస్తామని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం నాడు అన్నారు.
హైదరాబాద్: ఈసారి అసెంబ్లీ సమావేశాలలో ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సదుపాయాలు కల్పించలేమని, అందుకుగాను వారికి రూ.50వేలు చెల్లిస్తామని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం నాడు అన్నారు.
మార్చి 6వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని చెప్పారు. మార్చి 13న బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు. ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెడతామని చెప్పారు. ఉగాది లోపు బడ్జెట్ ప్రతిపాదించి, తర్వాత సభను వాయిదా వేయాలనుకుంటున్నామన్నారు.
స్పీకర్‌కు జగన్ లేఖ
ఏపీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. కొత్త అసెంబ్లీలో కొత్త సంప్రదాయాలు పాటించాలని హితవు పలికారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన వేటు వేయాలని ఆయన కోరారు.

కాగా, వెలగపూడి సచివాలయ ప్రాంగణంలోని నూతన అసెంబ్లీ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 2న ఉదయం 11.25 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశమందిరాలను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు.
మరోవైపు హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలిరానున్న అసెంబ్లీ సచివాలయ ఉద్యోగులు చేరుకుంటారు. స్పీకర్ కూడా సోమవారం నుంచి వెలగపూడి నుంచే విధులు నిర్వహిస్తారని శాసనసభ కార్యదర్శి సత్యనారాయణరావు తెలిపారు.
అసెంబ్లీ భవనంలో పేషీల కేటాయింపు అంశంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అధికారులతో సమీక్షిస్తారు.
మార్చి 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణ అసెంబ్లీకి కేటాయించిన ఉద్యోగులను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంతవరకూ రిలీవ్ చేయకుండా ఇక్కడే కొనసాగించాలని నిర్ణయించారు.
-
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications