రోజా గురించి ఓసారి ఆలోచించండి: కోడెలకు జగన్, చేతులెత్తేశారు: వాసిరెడ్డి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు సభాపతి కోడెల శివప్రసాద రావుకు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ అంశంపై లేఖ రాశారు. రూల్ ప్రకారం రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సరికాదన్నారు.
రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. రూల్ నెంబర్ 340 గురించి ఓసారి ఆలోచించాలన్నారు. ఓ సభ్యుడిని సస్పెండ్ చేయాలంటే కచ్చితంగా ఓటింగ్ ఉండాలని పేర్కొన్నారు. రూల్ 340 ప్రకారం సభ్యుడిని ఓ సెషన్‌కు మాత్రమే సస్పెన్షన్ చేయవచ్చునని చెప్పారు.
కానీ నిబంధనలకు విరుద్ధంగా రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ వేటు విధించారని చెప్పారు. వెంటనే రోజా పైన విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆ లేఖలో కోరారు.

సంక్రాంతి దోపిడీ: వాసిరెడ్డి పద్మ
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయివేటు ట్రావెల్స్‌తో పోటీగా ఆర్టీసీ దోచుకుంటోందని వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆర్టీసీ ఛార్జీలు ప్రయివేటు ట్రావెల్సుతో పోటీ పడుతున్నాయని ఆరోపించారు. ప్రయాణీకుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సంక్రాంతి పండుగకు వెళ్లే సామాన్యుల పైన భారం వేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రయివేటు ట్రావెల్స్ ఛార్జీలు నియంత్రించలేకపోతున్నామని రవాణా శాఖ మంత్రి చేతులెత్తేయడ శోచనీయమన్నారు. సంక్రాంతికి ఇచ్చేది 'చంద్రన్న కానుక కాదని సంక్రాంతి దోపిడీ' అన్నారు. రిటైల్ రంగంలోకి పెట్టుబడులకు చంద్రబాబు బార్లా తలుపులు తెరిచారన్నారు. రిటైల్ రంగంపై పెట్టుబడులకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications