కక్ష సాధింపులొద్దు: కెసిఆర్, బాబులకు జగన్ లేఖ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు.
తమ డిమాండ్లను పరిష్కారించాలని కోరుతూ సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.

కార్మిక సంఘాలతో తక్షణం చర్చలు జరిపి ఆర్టీసీ సమ్మెను విరమింపచేసే విధంగా చూడాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు వైఎయ జగన్ బహిరంగ లేఖ రాశారు.
ఆర్టీసీ కార్మికులపై కక్ష సాధింప చర్యలతో పాటు, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం తగదని సూచించారు. వారిపై పోలీసు చర్యలు కూడా దారుణంగా ఉన్నాయని వైయస్ జగన్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారి శాంతియుత ఆందోళనకు మద్దతిస్తున్నట్లు జగన్ తెలిపారు.












Click it and Unblock the Notifications