గూగుల్ సెర్చ్‌లో జగనే టాప్!?: చంద్రబాబును పట్టించుకోవట్లేదట!..

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మంది నెటిజెన్లు సెర్చ్ చేసిన నేతగా వైఎస్ జగన్ టాప్ లో నిలిచారు. గడిచిన 90రోజుల సెర్చ్ ఇంజిన్ సమాచారాన్ని విశ్లేషించి చూడగా.. గూగుల్ ట్రెండ్స్ లో జగనే టాప్ లో ఉన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో ఎక్కువమంది నెటిజెన్స్ జగన్ గురించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా వెల్లడైంది.

మరో విశేషమేంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో సమానంగా జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ ఉన్నట్లుగా గూగుల్ ట్రెండ్స్ లో స్పష్టమైంది. ఇక తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ల గురించి నెటిజెన్స్ అంతగా సెర్చ్ చేయడం లేదట.

ys jaganmohan reddy most googled politician in andhrapradesh

కాగా, మోడీ గురించి సెర్చ్ చేసినవాళ్లలో సగం మంది, కేజ్రీవాల్ గురించి సెర్చ్ చేసినవాళ్లలో మూడింట రెండొంతుల మంది ఏపీ నుంచి జగన్ కోసం సెర్చ్ చేశారట. విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో అయితే జాతీయ స్థాయి నాయకుల గురించే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట. హైదరాబాద్ లోను జాతీయ నాయకుల గురించే నెటిజెన్స్ గూగుల్ సెర్చ్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే, వైసీపీ అధికారిక ఫేస్ బుక్ పేజీకి 10నెలల్లోనే 3లక్షలకు పైగా లైక్స్ వచ్చాయని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Its an interesting news that AP opposition party leader YS Jagan was to in the list of recent google search.
Please Wait while comments are loading...