వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారితో విజయమ్మ, షర్మిల అభివాదం (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, పార్టీ నాయకురాలు షర్మిలలు సోమవారం వేర్వేరు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ‘వైయస్సార్ జనభేరి'లో పాల్గొని ప్రసంగించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డే కాదు, ఏ కార్డయినా 24 గంటల్లోపే ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేస్తానని చెప్పారు.

తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజునే ఐదు సంతకాలు చేస్తానని చెప్పారు. తొలి సంతకంతో అక్కాచెల్లెళ్లకు భరోసా ఇచ్చేదిగా ఉంటుందని, అదే అమ్మఒడి పథకమని చెప్పారు. తమ పిల్లలను బడికి పంపితే తమ ఒక్కో చిన్నారికి రూ. 500 చొప్పున ఖాతాలో జమ చేస్తాను అని తెలిపారు. రెండో సంతకం వృద్ధులకు రూ. 200 పింఛన్‌ను రూ. 700 చేస్తానని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం రూ. 3వేల కోట్ల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తూ మూడో సంతకం చేస్తానని చెప్పారు.

డ్వాక్రా మహిళలకు కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తూ నాలుగో సంతకం చేస్తానని చెప్పారు. ఏడాదికి 10 లక్షల దాకా పేదలకు ఇళ్లు కట్టిస్తానని జగన్ తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ నేత షర్మిల సోమవారం గుంటూరు జిల్లాలోని తెనాలి, సత్తెనపల్లి, పిడుగురాళ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకురావాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని షర్మిల ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. భారీ సంఖ్యలో వచ్చిన మహిళలు ఆమెకు స్వాగతం పలికారు. మహిళలలు, చిన్నారులను విజయమ్మ ఈ సందర్భంగా అప్యాయంగా పలకరించారు.

జగన్ అభివాదం

జగన్ అభివాదం

తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ‘వైయస్సార్ జనభేరి'లో పాల్గొని ప్రసంగించారు.

జగన్ రోడ్‌షో

జగన్ రోడ్‌షో

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డే కాదు ఏ కార్డయినా 24 గంటల్లోపే ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేస్తానని జగన్ చెప్పారు.

షర్మిల ప్రసంగం

షర్మిల ప్రసంగం

వైయస్సార్ కాంగ్రెస్ నేత షర్మిల సోమవారం గుంటూరు జిల్లాలోని తెనాలి, సత్తెనపల్లి, పిడుగురాళ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రసంగిస్తున్న జగన్

ప్రసంగిస్తున్న జగన్

తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజునే ఐదు సంతకాలు చేస్తానని చెప్పారు. తొలి సంతకంతో అక్కాచెల్లెళ్లకు భరోసా ఇచ్చేదిగా ఉంటుందని, అదే అమ్మఒడి పథకమని చెప్పారు. తమ పిల్లలను బడికి పంపితే తమ ఒక్కో చిన్నారికి రూ. 500 చొప్పున ఖాతాలో జమ చేస్తాను అని జగన్ తెలిపారు.

చిన్నారితో విజయమ్మ

చిన్నారితో విజయమ్మ

ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

English summary
YSR Congres Party president YS Jaganmohan Reddy carried a road show at Tuni in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X