టిడిపిలోకి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బంధువులు: బుద్దా వెంకన్న సంచలనం
విజయవాడ: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బంధువులే టిడిపిలో చేరనున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపంచారు. గురువారం నాడు బుద్దా వెంకన్న విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
Recommended Video

వైసీపీ పని అయిపోయిందని ఆయన ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బంధువులే టిడిపిలో చేరనున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బిట్ కాయిన్ కుంభకోణం సొమ్మును రామకృష్ణారెడ్డి జగన్ పాదయాత్రకు మళ్ళించారని బుద్దా వెంకన్న ఆరోపించారు.

టిడిపి నాయకులపై ఆరోపణలు చేయడం, విమర్శలు గుప్పించడమే రోజా పనిగా పెట్టుకొన్నారని బుద్దా వెంకన్న విమర్శించారు.టిడిపి, బిజెపిలు మిత్రపక్షాలేనని చెప్పారు. బిజెపి నేతలు ఎన్ని విమర్శలు చేసినా చిరునవ్వుతో స్వాగతిస్తామన్నారు.
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యవహరాన్ని సీఎం చంద్రబాబునాయుడు చూసుకొంటారని బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. బిజెపి, టిడిపిల మధ్య అగాధం పెరిగిపోవాలని కొందరు కోరుకొంటున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.












Click it and Unblock the Notifications