Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ కు షర్మిల స్పెషల్ విషెస్, తొలి సారి - పవన్.. సాయిరెడ్డితో సహా..!!

YS Jagan HBD: మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదినం ఈ రోజు. పలువురు ప్రముఖులు జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణులు జగన్ జన్మదినం సెలబ్రేట్ చేస్తున్నారు. పార్టీ ముఖ్యులు.. కార్యకర్తలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా జగన్ కు శుభాకాంక్షలు అందుతున్నాయి. కాగా, జగన్ సోదరి షర్మిల ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్.. సాయిరెడ్డి సహా పలువురు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు చేసారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదినం వేళ సోదరి షర్మిల స్పందించారు. జగన్ తో విభేదించిన తరువాత షర్మిల దాదాపుగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పటం ఇదే తొలి సారిగా పార్టీ నేతలు చెబుతున్నారు. రాఖీ తో సహా పలు సందర్భాల్లో షర్మిల ట్వీట్లు చేసినా.. జగన్ ప్రస్తావన ఎక్కడా చేయలేదు. రాజకీయంగా జగన్ ను టార్గెట్ చేసిన షర్మిల ప్రస్తుతం కొంత తీవ్రత తగ్గించినట్లు కనిపిస్తోంది. జగన్ - షర్మిల ఇద్దరూ వైఎస్ జన్మదినం.. వర్థంతి రోజున ఇడుపులపాయలో ఒకే చోటకు వెళ్లినా.. పలకరింపులు చోటు చేసుకోలేదు. కాగా.. ఈ సారి జగన్ కు జన్మదినం వేళ షర్మిల ట్వీట్ చేసారు. అందులో..." YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి @ysjagan గారికి జన్ మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.." అని పేర్కొన్నారు. ఈ పోస్టింగ్ కు పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్టు అవుతున్నాయి.

ys-sharmila-and-vijaya-sai-reddy-special-wishes-for-ys-jagan-on-his-birth-day

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.' అని సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పవన్ పోస్టు చేసారు. ఇక, వైసీపీ వీడిన జగన్ సన్నిహిత నేత విజయ సాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. తన ట్వీట్ లో.." Warm birthday wishes to Shri @ysjagan Garu, Former Chief Minister of Andhra Pradesh and President of YSRCP. May you be blessed with good health, happiness, strength and success in the service of the people..." అంటూ ట్వీట్ చేసారు. అదే విధంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ సైతం జగన్ కు గ్రీటింగ్స్ చెప్పారు. పార్టీలోని పలువురు నేతలు సైతం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేసారు. ఇక.. బెంగళూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో IT WING SEASON-3 పేరుతో క్రికెట్ టోర్నమెంట్ శనివారం ఉదయం బెంగళూరు నగరంలోని చేతన్ క్రికెట్ గ్రౌండ్స్ వద్ద ఘ‌నంగా ప్రారంభించారు.

"This Time the Game Will be Different, Let's Win 2029" అనే నినాదంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+