ఆడియోతో అడ్డంగా దొరికిపోయిన వైఎస్ షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సంబంధించిన ఆడియో కాల్ క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంతల సుబ్బారావుతో కాల్ చేసి మాట్లాడారామె. దీనికి సంబంధించిన ఆడియో కాల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వంతల సుబ్బారావు తొలి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు ఆయనకే టికెట్ అంటూ కాంగ్రెస్ నేతలు సైతం బహిరంగంగానే ప్రకటించారు.
అయితే పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే బుల్లిబాబుకు వైసీపీలో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో వంతల సుబ్బారావును పక్కన పెట్టి బుల్లిబాబుకు టికెట్ కేటాయించారు కాంగ్రెస్ నాయకులు. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వంతల సుబ్బారావు పాడేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. వంతల సుబ్బారావు రెబల్‌గా పోటీ చేస్తే ఓట్లు చీలి అక్కడ వైసీపీ అభ్యర్థికి ఫలితం అనుకూలంగా వచ్చే అవకాశం ఉండటంతో వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు. వంతల సుబ్బారావుతో ఆమె రాయబారం నడిపారు.

ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మీరు సొంత అన్నమాదిరి అని, అర్థం చేసుకోవాలని, తర్వాతిసారి చూద్దాం అంటూ బతిమాలాడారామె. దీనిపై వంతల సుబ్బారావు మాట్లాడుతూ..ఏనాడూ జెండా మోయనోడికి టికెట్ ఇవ్వడం తనను బాధించిందని, పైగా తనతో మాట కూడా చెప్పకుండా వేల మంది ముందు బుల్లిబాబును అభ్యర్థిగా ప్రకటించడం తనను నిరాశ పర్చిందని షర్మిలతో ఆయన అన్నారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో పాటు వైసీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల వంతల సుబ్బారావుకు స్పష్టం చేశారు. అలాంటప్పుడు తొలుత నన్ను ఎందుకు అభ్యర్థిగా ప్రకటించారని.. నా రాజకీయ జీవితం నాశానం అయిందని షర్మిలకు వంతల సుబ్బారావు తెలిపారు. ఎంత నచ్చజెప్పినప్పటికీ వంతల సుబ్బారావు వినిపించుకోలేదు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే కాంగ్రెస్ గురించి మరిచిపోవాలంటూ షర్మిల హుకుం జారీ చేశారు. మంచిదంటూ వసంత సుబ్బారావు సైతం షర్మిలకు కౌంటరిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications