కాంగ్రెస్ తో షర్మిల బంధం ఫిక్స్, టార్గెట్ ఏపీ వయా పాలేరు - తాజాగా రాహుల్ కు..!?

వైఎస్ షర్మిల..కాంగ్రెస్ బంధం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో ఈ మేరకు చర్చలు ఫలించినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ తో కలవాలని కొద్ది రోజుల క్రితం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చొరవతో నేరుగా ప్రియాంక నుంచి ఆఫర్ వచ్చింది. ఆ సమయంలోనే తెలంగాణ టు ఏపీ రాజకీయాల్లో షర్మిలకు ప్రాధాన్యతపైన హామీ దక్కిందని సమాచారం. విలీనం ప్రతిపాదన కొట్టి పారేసిన షర్మిల తాజాగా చేసిన ట్వీట్...అడుగులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

YS Sharmila

రాహుల్ గాంధీకి షర్మిల ట్వీట్
వైఎస్ షర్మిల ఈ రోజు ఒక ట్వీట్ చేసారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల బర్త్ డే విషెస్ చెప్పారు.ఈ రోజు మీకు సంతోషకరమైన అద్భుతమైన రోజు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ పట్టుదల, సహనంతో నిత్యం ప్రజలకు అలాగే స్పూర్తివతంగా ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని కోరారు. వైఎస్సార్ మరణం తరువాత చోటు చేసుకున్న వరుస పరిణామాలతో కాంగ్రెస్ నాయకత్వానికి వైఎస్ కుటుంబం దూరమైంది. ఆ తరువాత ఎప్పుడూ ఆ కుటుంబంతో సంబంధాలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ తో తిరిగి షర్మిల బంధం ఖాయమని ప్రచారం సాగుతున్న వేళ ప్రత్యేకంగా వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల చేసిన ట్వీట్..ఆ పార్టీతో బంధానికి నాందిగా విశ్లేషణలు మొదలయ్యాయి.

YS Sharmila

కాంగ్రెస్ తో బంధం పక్కా
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ షర్మిల పార్టీ ఏర్పాటు చేసారు. సుదీర్ఘ కాలం పోరాటం చేసారు. కానీ, ఆశించిన మద్దతు లభించలేదు. రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తరువాత తెలంగాణలో ఆ పార్టీ నేతలు వేగంగా అడుగులు వేస్తున్నారు. డీకే శివకుమార్ తో షర్మిల వరుస సమావేశాలు నిర్వహించారు. షర్మిలతో నేరుగా ప్రియాంక గాంధీ చర్చలు చేసారు. పార్టీ విలీనం ప్రాతిపాదించారు. ముందు తెలంగాణలో..ఆ తరువాత షర్మిల సేవలు వినియోగించుకుంటామని..వైఎస్సార్ కుమార్తెగా సుముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. షర్మిల కోరుకున్న విధంగా పాలేరు సీటుతో పాటుగా అసెంబ్లీ సీట్ల పైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు.

టార్గెట్ ఏపీ వయా పాలేరు
ఇప్పుడు తాజాగా షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడానికి ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ వ్యవహారం వెనక వైఎస్సార్ ఆత్మగా పేరుపొందిన కేవీపీ రామచంద్రా రావు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటన చేయనున్నారని చెబుతున్నారు. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ ల విలీనం లేదా పొత్తు ఖాయమై..కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నట్లుగా ఏపీలోనూ ఆ పార్టీకి సేవలందించేందుకు ముందకు వస్తారా.. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ..టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారానికి దిగుతారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఈ మొత్తం పరిణామాల పైన షర్మిల అధికారిక స్పందన కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+