Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..!

ఇవాళ ఏపీ అసెంబ్లీలో కూటమి సర్కార్ అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం చేస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేయకపోవడంతో ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ మూడు రాజధానుల్ని తెరపైకి తేవడంతో ఇప్పుడు మరోసారి అలాంటి తప్పిదాలు జరగకుండా ఈ కార్యక్రమం చేపట్టింది. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపించి, ఆ మేరకు ఏపీ పునర్విభజన చట్టానికి పార్లమెంట్ లో సవరణ చేయించడమే దీని ఉద్దేశం. అయితే ఈ తీర్మానంపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల (Ys Sharmila) స్పందించారు.

అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానం హర్షణీయమే, సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమే అని షర్మిల తెలిపారు. మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే..అని ముందుచూపు ఉండడం మీ విజన్ కి నిదర్శనం అనుకుందాం, మరి రాజధాని కోసం విభజన చట్టంలో పెట్టిన సెక్షన్ 94(3) సంగతేంటి చంద్రబాబు అని షర్మిల ప్రశ్నించారు. సెక్షన్ 5 (సబ్ సెక్షన్ 2)లో ఎట్ అమరావతి పదాన్ని పెట్టించేందుకు ఉన్న శ్రద్ధ.. సెక్షన్ 94(3) కింద అమరావతి ఫండ్స్ అడిగేందుకు లేదా ? అని నిలదీశారు.

YS Sharmila Fires at Chandrababu Over Amaravati Plan Cites Lack of Central Funding

గెజిట్ తోనే అమరావతి గెయిన్ అవుతుందా ? ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ భాద్యత కేంద్రానిదే అని తెలియదా ? ఎంతైతే అంత కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే అనే క్లాజ్ సెక్షన్ 94(3d) చదవలేదా ? అని షర్మిల వరుస ప్రశ్నలు సంధించారు. కేంద్రం చేస్తున్న మోసంపై వద్దా అసెంబ్లీ తీర్మానం ? నిధులు హక్కుగా ఇవ్వాల్సిందేనని చేయొద్దా తీర్మానం ? అని ప్రశ్నించారు. విభజన చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తుంటే అసెంబ్లీ వేదికగా తీర్మానం వద్దా? మోడీ గారిచ్చిన చెంబుడు నీళ్లు,తట్టెడు మట్టితో సరిపెట్టుకుందామా ? ఇదే బీజేపీ రాజధానికి ఇచ్చిన గొప్ప ప్రసాదంగా భావిద్దామా ? అసలొద్దు.. అప్పులిప్పిస్తే చాలని రాజీపడదామా? పదో పరకో ముష్టిగా పడేస్తుంటే ఇప్పటికింతే సంతోషం అనుకుందామా? అమరావతికి నిర్మాణానికి పట్టే రూ.1 లక్ష కోట్లు ప్రజల నెత్తిమీద వేద్దామా? అని ప్రశ్నలు గుప్పించారు. ఈ ప్రశ్నలపై కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+