అమరావతిని జగన్ వ్యతిరేకించలేదు, కానీ - వైసీపీ సంచలన ప్రకటన..!!

ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అమరావతి గురించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పైన కూటమి నేతలు మండిపడ్డారు. జగన్ అమరావతి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కు ఇంకా అమరావతి పైన అక్కసు తగ్గలేదని మండిపడ్డారు. కాగా, ఇప్పుడు జగన్ వ్యాఖ్యల పైన చోటు చేసుకుంటున్న చర్చ.. వివాదం వేళ వైసీపీ అధికారికంగా స్పందిం చింది. అమరావతి పై జగన్ చేసిన వ్యాఖ్యల పై స్పష్టత ఇచ్చింది. తమ వైఖరి తేల్చి చెప్పింది.

అమరావతి పైన మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమరావతిలో ఖర్చు.. రెండో విడత భూ సేకరణ..కావాల్సిన నిధుల పైన జగన్ మాట్లాడారు. అదే సమయంలో విజయవాడ - గుంటూరు మధ్యలో రాజధాని కట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా, జగన్ వ్యాఖ్యల పైన కూటమి నేతలు చేస్తున్న విమర్శలతో వైసీపీ స్పందించింది. ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించ లేదని చెప్పారు. అమరావతిలో అన్యాయం, అవినీతిపై ఎందుకు ప్రశ్నించకూడదని నిలదీసారు. పాలనా వికేంద్రీకరణలో అమరావతిని వైసీపీ ప్రభుత్వం తక్కువ చేయలేదని చెప్పుకొచ్చారు. విశాఖలో సీఎం కూర్చుంటే మరింత అభివృద్ధి అని చెప్పామని వివరించారు. జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం ఎలా దెబ్బతీస్తుందనేది వివరించారని చెప్పారు.

ysrcp-leader-sajjala-clears-party-stand-over-amaravati-as-captial-details-here

చంద్రబాబు రాయలసీమ ప్రజల ఉసురు కొట్టుకుంటున్నారని సజ్జల పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు సమాధానాలు లేవని ఆక్షేపించారు. జగన్ అమరావతి పై పలు ప్రశ్నలు సంధించారని.. తొలిదశ 50 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారన్నారు. ముందు ఇచ్చిన రైతులకు ఏమీ చేయకుండా రెండవ దశకు వెళ్ళటం తప్పు కదా అని ప్రశ్నించారని వివరించారు. రైతులకు ఇస్తున్న రిటర్న్ ఫ్లాట్స్ కు కనీస మౌలిక సదుపాయాలు కల్పన లేదని గుర్తు చేసారన్నారు. ఫ్లాట్స్ దగ్గరకు వెళ్ళటానికి రోడ్లు కూడా లేవని.. 2019 లో జగన్ ఇదే ప్రశ్నలు లేవనెత్తారని గుర్తు చేసారు. 50 ఎకరాల్లో అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్లు కావాలని.. ఇది అప్పుడున్న పరిస్తితుల్లో అది సాధ్యం కాదు అని చెప్పారని వివరించారు. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు సేకరణ చేస్తున్నారు..అప్పుడు మొత్తం రెండు లక్షల కోట్లు కావాలని చెప్పిన అంశాన్ని విశ్లేషించారు. ప్రయారిటీ ప్రకారం రైతులకు న్యాయం చేయట్లేదని.. 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయ భవనాలు అంటున్నారని చెప్పకొచ్చారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ కూడా 10 లక్షల చదరపు అడుగులు..పార్లమెంట్ 7 ఏడు లక్షల చదరపు అడుగులు ఉండగా.. ఒక్కొక్క స్క్వేర్ ఫీటుకు 12 వేల వరకు ఇస్తున్నారని చెప్పారు. అమరావతి పేరు చెప్పి తనవాళ్ళకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. రైతుల బాధలు పట్టించుకోకుండా మిగతా అన్నీ ఎందుకు అడుగుతున్నామని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ గురించి అడిగితే సమాధానాలు లేవని.. కానీ అమరావతిపై రైతుల పక్షాన మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ గా అభివర్ణించారు. జగన్ అమరావతి లో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు.. చంద్ర బాబు పదేళ్ల తర్వాత ఇప్పుడు ఇల్లు మొదలుపెట్టారన్నారు. డీ సెంట్రలైజ్ అని చెప్పినప్పుడు కూడా అమరావతి ని వదిలిపెట్టలేదన్నారు. కావాలనే జగన్ మాటలను ఇష్టానుసారం వక్రీకరిస్తున్నారని చెప్పారు. అమరావతి రైతులే మమ్మల్ని మళ్లీ ముంచుతున్నారు అని చెప్పుకుంటున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. వైజాగ్ అయితే వేగంగా పెరుగుతుందని వెళ్లాలి అన్నారు తప్ప మరో కారణం లేదని స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+