వల్లభనేని వంశీపై షర్మిల కొత్త అస్త్రం - టీడీపీకి కలిసొచ్చేనా..!!
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. బీజేపీ తీరు పైన స్పష్టత రావాల్సి ఉంది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల నేరుగా ముఖ్యమంత్రి లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలోనే మాజీ కాంగ్రెస్ నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా గన్నవరంలో షర్మిల అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
టీడీపీ ఈ సారి గన్నవరం, గుడివాడ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఎలాగైనా వల్లభనేని వంశీ, కొడాలి నానిని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వైసీపీ నుంచి 2019లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే వంశీ పైన టీడీపీ అభ్యర్దిగా పోటీ చేయనున్నారు. వంశీ వైసీపీలోకి వచ్చిన సమయంలో అక్కడ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు పాత్ర కీలకంగా మారుతోంది. వంశీకి మద్దతు ఇచ్చేందుకు దుట్టా పలు సందర్భాల్లో వ్యతిరేకించారు. ఈ సమయంలోనే షర్మిల నేరుగా దుట్టాతో మంత్రాంగం ప్రారంభించారు.హనుమాన్ జంక్షన్‌లోని దుట్టా నివాసానికి వెళ్లిన షర్మిల.. తాజా రాజకీయాలపై దుట్టాతో చర్చించారు. పార్టీలో చేరాలని ఆహ్వానించగా.. సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దుట్టా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. నాన్నకు దుట్టా అత్యంత సన్నిహితులు.. పార్టీకి, తమకు అండగా నిలబడతా అంటూ హామీ ఇచ్చారని షర్మిల చెప్పారు. 2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరఫున వంశీ పోటీచేయగా.. వైసీపీ తరఫున రామచంద్రరావు పోటీచేశారు. అయితే.. 9,548 ఓట్ల తేడాతో వంశీ గెలిచారు. దుట్టా నిజంగా టీడీపీలో చేరితే వైసీపీకి గన్నవరంలో ఇబ్బంది కర పరిస్థితులు తప్పవనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి వల్లభనేని వంశీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. పార్టీ ముఖ్య నాయకత్వం గన్నవరం నుంచి వంశీ గెలుపు కోసం సహకారం అందిస్తోంది. దుట్టా ఇప్పుడు షర్మిల చెబుతున్నట్లుగా కాంగ్రెస్ లో చేరితో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే గన్నవరం ఫలితం పైన మరింత ఉత్కంఠ పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications