షర్మిల ప్రతిపాదనకు రాహుల్ ఓకే, కీలక మలుపు...!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి.. వైసీపీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న రాజకీయంలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. వైపీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా.. కొంత కాలంగా రాజకీయంగా అంత యాక్టివ్ గా లేని పీసీసీ చీఫ్ షర్మిల తాజాగా రాహుల్ తో భేటీ అయ్యారు. కీలక ప్రతిపాదన చేసారు. అందుకు రాహుల్ సైతం అంగీకారం తెలిపారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు కానుంది.

ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. జగన్ టార్గెట్ గా షర్మిలను కాంగ్రెస్ నాయకత్వం ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించింది. 2023 ఎన్నికల్లో జగన్ లక్ష్యంగా షర్మిల చేసిన ప్రచారం ప్రభావం చూపింది. షర్మిల కేవలం జగన్ ను మాత్రమే టార్గెట్ చేసి.. ఎన్డీఏ కూటమి పైన ఉదాసీనంగా ఉంటున్నారని కాంగ్రెస్ నేతల నుంచే విమర్శలు ఉన్నాయి. కొంత కాలంగా షర్మిల రాజకీయంగా నామ మాత్రంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో షర్మిల తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాల పైన చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని రాహుల్‌ను కోరారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి ఫిబ్రవరి 2వ తేదీతో 20 ఏళ్లు పూర్తవుతుందని గుర్తు చేసారు. కేంద్రం తాజాగా ఉపాధి హామీ పథకం పైన తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలకు సిద్దం అవుతోంది. ఈ క్రమంలో షర్మిల ఢిల్లీలో రాహుల్ తో చర్చించారు.

ys-sharmila-invites-rahul-gandhi-to-participate-protest-against-central-decision-over-nregs-from-ana

కీలక మలుపు

దీంతో, ఏపీ నుంచే ఉపాధి హామీ పునరుద్ధరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని రాహుల్‌ గాంధీని కోరానని పేర్కొన్నారు. ఏపీ పర్యటనకు వస్తానని, పార్టీ పోరాటంలో భాగస్వామ్యం అవుతానని ఆయన హామీ ఇచ్చినట్టు షర్మిల తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుంచే ఈ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు షర్మిల వివరించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని ఆమె వెల్లడించారు. ఇదే అంశంలో జగన్ తన వైఖరి ఏంటనేది ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. ఇక, తన తండ్రి హయాంలో ఏపీ కేంద్రంగా ప్రారంభించిన చోట నుంచే తిరిగి ఇప్పుడు షర్మిల తిరిగా కాంగ్రెస్ అధినాయకత్వంతో ఆ పథకం పునరుద్దరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టటం పైన వైసీపీ స్పందన పైన స్పష్టత రావాల్సి ఉంది. కేంద్రంలో.. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండటంతో...రాహుల్ ఏపీ కేంద్రంగా తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+