అటు జగన్, ఇటు షర్మిల - ఇక ఇద్దరూ జనంలోనే : గేమ్ షురూ..!!!
ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ అభ్యర్దుల ఎంపిక దాదాపు పూర్తి చేసారు. ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. పవన్ తో పాటుగా సభల్లో పాల్గొనేందుకు నిర్ణయించారు. బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల సైతం ప్రజల్లోనే ఉండాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది.
Recommended Video

ప్రజల్లోకి షర్మిల
ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 27 నుంచి వరుస జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. 27న భీమిలిలో భారీ సభలో పాల్గొంటున్నారు. ఆ తరువాత రీజియన్ల వారీగా కేడర్ తో మమేకం కానున్నారు. ఇక, ఫిబ్రవరి లో అసెంబ్లీ సమావేశాల తరువాత ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా చంద్రబాబు - పవన్ కలిసి సభల్లో పాల్గొనే అంశం పైన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులోగా సీట్ల సర్దుబాటు, అభ్యర్దుల ఎంపిక పైన ఒక స్పష్టతకు రానున్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని ఇద్దరు నేతలు డిసైడ్ అయ్యారు. ఈ సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరించారు.

నేతల చేరికలు
కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ నుంచి వీడిన వారిని తిరిగి పార్టీలోకి రప్పించటం..పార్టీ ఓట్ బ్యాంకు పెంచటం లక్ష్యంగా నిర్ణయించింది. అందులో భాగంగా సీట్లు దక్కని ఇతర పార్టీల్లోని నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సమయంలోనే షర్మిల ఇక ప్రజల మధ్యకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ వారంలోనే ఇచ్ఛాపురం నుంచి షర్మిల జిల్లాల యాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రకు సమయం లేకపోవటంతో బస్సు యాత్ర ద్వారా ఇచ్ఛాపురం నుంచి ఇడుపుల పాయ వరకు కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం చేయటంతో పాటుగా జిల్లాల్లో నేతల చేరికలు..ప్రభుత్వ వైఫల్యాల పైన..పార్టీల వైఖరి పైన షర్మిల ప్రధానంగా ప్రస్తావన చేస్తారని చెబుతున్నారు.
ప్రజా మద్దతు ఎవరికి
ఇప్పటికే ఏపీలో ఎన్నికల ప్రచారం మొదలైంది. అయితే షర్మిల తన ప్రచారంలో వైసీపీ ప్రభుత్వం పైన గురి పెడతారని తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీతో టీడీపీ, జనసేన సంబంధాల గురించి నిలదీస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, సీఎం జగన్, చంద్రబాబు, పవన్, షర్మిల జనం మధ్యనే ఉండేందుకు డిసైడ్ అయ్యారు. దీని ద్వారా జగన్ ను ఓడించటమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు అడుగులు వేస్తున్నాయి. షర్మిల అటు జగన్, ఇటు చంద్రబాబు పైన షర్మిల ఏవిధంగా టార్గెట్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications