సోనియా, రాహుల్ తో భేటీ - షర్మిల సంచలన నిర్ణయం..!!
ఏపీలో రాజకీయం మారుతోంది. కొత్త అసెంబ్లీ కొలువు తీరింది. రాజకీయంగా కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో వైసీపీ కేవలం ఏడు స్థానాలకే పరిమితం అయింది. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల ఈ ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా పని చేసారు. వరుసగా మూడో ఎన్నికలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇక..షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో భేటీ అయ్యారు. పార్టీ పరంగా కీలక నిర్ణయం ప్రకటించారు.
ఏపీ ఎన్నికల్లో షర్మిల పోటీ చేసి ఓడిపోయారు. కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిలతో సహా పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్దులు ఎవరూ విజయం సాధించలేదు. తన ఓటమికి కారణం ప్రచారానికి సరైన సమయం లేకపోవటమే ప్రధాన అంశంగా షర్మిల చెప్పుకొచ్చారు. ఇక..జగన్ ఓటమి గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ,పవన్ ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని కోరారు. తాజాగా ఢిల్లీలో పార్టీ అగ్రనాయకత్వంతో షర్మిల సమావేశమయ్యారు. ఏపీలో ఎన్నికల ఫలితాల పై సమీక్షించారు.

ఎన్నికల తరువాత షర్మిల పైన సొంత పార్టీ నేతలు ఆరోపణలు చేసారు. టికెట్ల కేటాయింపు లో అవకతవకలు జరిగాయని విమర్శించారు. విజయవాడ కు చెందిన మహిళా నేత షర్మిల లక్ష్యంగా సంచలన ఆరోపణలు తెర మీదకు తెచ్చారు. ఏపీలో పరిస్థితుల పైన పార్టీ నాయకత్వంతో షర్మిల చర్చించారు. తాజాగా షర్మిల కీలక నిర్ణయం ప్రకటించారు. పార్టీలో కొనసాగుతున్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడిండారు. త్వరలోనే పార్టీ కమిటీలను తిరిగి ఏర్పాటు చేస్తామని షర్మిల స్పష్టం చేసారు. షర్మిల నిర్ణయం ఇప్పుడు పార్టీలో సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications