వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..!
ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ అన్న వైఎస్ జగన్ (ys jagan)ను, ఆయన పార్టీ వైఎస్సార్సీపీని టార్గెట్ చేస్తున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) ఇవాళ అనూహ్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని, తన జోలికి వస్తే అఫెన్సివ్ గేమ్ కూడా ఆడగలనంటూ హెచ్చరికలు చేశారు. తన లక్ష్యం జగన్ మోహన్ రెడ్డి కానే కాదన్నారు. వైసీపీ సైతాన్ సైన్యం వల్ల ప్రతిసారి తాను సంజాయిషీ, సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందన్నారు.
నేను ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నించానన్నారు. అరటి రైతుల కోసం మేము చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాలి కానీ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతారా? అని వైసీపీని నిలదీశారు.ప్రభుత్వంలో 5 ఏళ్ళు నిద్రపోయి నెల ముందు నిద్ర లేచారా అని అడిగారు.
సిద్ధం సభలు అంటూ బయటకు వచ్చి రిబ్బన్లు కట్ చేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గా ఉండి బనానా ప్రాసెసింగ్ యూనిట్ పై ఎందుకు నిద్ర పోయారని జగన్ ను ప్రశ్నించారు. తాను రైతుల కోసం పోరాడుతుంటే , తన మాటకు ఇంకో మాట మద్దతుగా మాట్లాడకుండా టార్గెట్ చేస్తారా అంటూ వైసీపీని ప్రశ్నించారు. మళ్లీ మీకు ప్రతిపక్షం కావాలని ఎద్దేవా చేశారు. వైసీపీ జోలికి తాను రానని, జోలికి వస్తే అఫెన్సివ్ గేమ్ ఆడటం తెలుసన్నారు.

తాను వైసీపీని టార్గెట్ చేయబోనని, ఆ పార్టీ తనను అటాక్ చేస్తుంటే, తనను తాను డిఫెండ్ చేసుకుంటున్నట్లు షర్మిల తెలిపారు. మొన్న విజయమ్మ లేఖ మీద వైసీపీ చేసింది అనవసరమైన రాద్దాంతమని తెలిపారు. విజయమ్మ లేఖ సుప్రీమ్ కోర్ట్ తీర్పు తో సమానమన్నారు. తాను వైసీపీ నేతలను కుక్కలు అనలేదని, విజయమ్మ మాట్లాడొద్దు అంటే .. మాట్లాడుతున్నారు అంటే మొరగడం కుక్కల నైజం అనుకోవాలి అని మాత్రమే అన్నానని తెలిపారు. కుక్కలు అని తాను అన్నట్లు భుజాలు తడుముకుంటున్నారని వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. వైసీపీ వాళ్ళను కుక్కలతో పోలిస్తే కుక్కలు బాధపడతాయన్నారు.












Click it and Unblock the Notifications