పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయిన " వైఎస్ఆర్ మనవడు ".. విజయమ్మ ఆశీర్వాదం !
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. వైఎస్ రాజారెడ్డి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరకు.. ఆ కుటుంబం ఎన్నో దశాబ్దాలుగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలతో, సంక్షేమ పథకాలతో ప్రజల మనసు గెలిచి 'ప్రజల సీఎం'గా నిలిచారు. ఆయన అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ సైతం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లో సొంతగా పార్టీ పెట్టారు జగన్‌మోహన్ రెడ్డి.
జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల సైతం పొలిటికల్ గా యాక్టివ్ అయ్యి.. పాదయాత్ర చేసి వైసీపీకి అండగా నిలిచారు. 2019 ఎన్నికల విజయంతో ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టారు. అయితే, కాలక్రమేణా సోదర-సోదరి మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ఆస్తి వివాదాలు, రాజకీయ భిన్నాభిప్రాయాలు కారణంగా షర్మిల వైసీపీ నుంచి దూరమయ్యారు. తెలంగాణలో స్వంత పార్టీ ప్రారంభించినా, అది సక్సెస్ కాకపోవడంతో చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

ప్రస్తుతం షర్మిల.. కాంగ్రెస్ హైకమాండ్ సూచనలతో ఏపీలో పార్టీని పునరుద్ధరించడానికి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం. కర్నూలు ఉల్లి మార్కెట్‌లో ఆయన తల్లితో కలిసి పర్యటించడం చర్చనీయాంశమైంది. రైతుల సమస్యలు తెలుసుకోవడం, వారితో మమేకం కావడం ద్వారా తన మొదటి పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చారు.
కాగా కర్నూలు పర్యటనకు ముందు రాజారెడ్డి తన అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, ఆయన అధికారిక రాజకీయ రంగప్రవేశానికి బాటలు వేసినట్లు భావిస్తున్నారు. యువతను, రైతులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ నుంచి రాజారెడ్డిని పోటీ చేయించే ఆలోచనలో షర్మిల ఉన్నారని చెబుతున్నారు.
రాజారెడ్డి వ్యక్తిగత జీవితం..
1996 డిసెంబర్‌లో జన్మించిన రాజారెడ్డి, హైదరాబాద్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి, అమెరికాలోని డాలస్ యూనివర్శిటీలో బిజినెస్ డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలో ఉద్యోగం చేసిన అనుభవం కూడా ఉంది. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన ఆయన.. వ్యాయామం పట్ల కూడా ఆసక్తి కనబరుస్తారు. గతేడాది అట్లూరి ప్రియతో రాజస్థాన్‌లో ఘనంగా వివాహం జరిగింది.
బ్రేకింగ్ న్యూస్..
— Telugu Stride (@TeluguStride) September 8, 2025
రాజకీయాల్లోకి వైఎస్ షర్మిలా రెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి ?
ఇవ్వాళ కర్నూల్ ఉల్లి మార్కెట్ కు తల్లితో సహా సందర్శనకు వెళ్ళిన రాజారెడ్డి
ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న వైఎస్ రాజారెడ్డి
త్వరలో రాజకీయ అరంగ్రేటం చేయనున్నట్లు చర్చ..#sharmila… pic.twitter.com/GVsNAozzmK
ఇక ఇప్పుడు మొత్తం మీద వైఎస్ కుటుంబంలో మరో వారసుడు రాజకీయాల్లోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. జగన్ ఒకవైపు అధికారంలో లేని సమయంలో.. షర్మిల-రాజారెడ్డి కాంబినేషన్ కాంగ్రెస్ తరపున రంగంలోకి దిగితే రాజకీయ సమీకరణాల్లో మార్పులు రావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications