గేరు మార్చిన వైఎస్ షర్మిల..! 26 మంది నేతలకు షాక్..!

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లోనూ కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా కర్నాటక కాంగ్రెస్ నేత పీవీ మోహన్ నియమితులయ్యారు. ఆయన వచ్చీ రాగానే నేతల్ని గాడిలో పెట్టడంతో పాటు పార్టీ వ్యవహారాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు పీసీసీ ఛీఫ్ షర్మిల (YS Sharmila) కూడా తోడయ్యారు. దీంతో పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన 26 మంది నేతలకు షోకాజ్ నోటీసులు పంపారు.

మోడీకి సొంత రాష్ట్రంలో మరో ఝలక్..! కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం..!
మోడీకి సొంత రాష్ట్రంలో మరో ఝలక్..! కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం..!

ఈ నెల 3న విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి హాజరు కావాలని ఈసీ సభ్యులందరికీ ఆహ్వానాలు పంపారు. అయితే ఇందులో మొత్తం 26 మంది సభ్యులు డుమ్మా కొట్టారు. ఈ వ్యవహారాన్ని ఏపీసీసీ క్రమశిక్షణా సంఘం సీరియస్ గా తీసుకుంది. దీంతో వీరందరికీ ఇవాళ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

YS Sharmila Takes Action as 26 APCC Members Face Show-Cause Notices Over Meeting Absence
ఇండియా కూటమిలోకి జగన్ ? కాంగ్రెస్ వీటికి ఒప్పుకుంటే..! కీలకంగా షర్మిల..!
ఇండియా కూటమిలోకి జగన్ ? కాంగ్రెస్ వీటికి ఒప్పుకుంటే..! కీలకంగా షర్మిల..!

ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ఛార్జి పీవీ మోహన్, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల అధ్యక్షతన జరిగిన ఈ కార్యవర్గ భేటీలో పార్టీకి సంబంధించిన పలు ముఖ్యమైన రాజకీయ, సంస్థాగత అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ భేటీకి హాజరు కాకపోవడం పట్ల 26 మంది సభ్యులపై వీరు ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో కీలకమైన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి సభ్యులు హాజరై చురుకుగా పాల్గొనడం వారి బాధ్యతలో భాగమని, ఎటువంటి సంతృప్తికరమైన కారణం లేకుండా సమావేశానికి గైర్హాజరు కావడం పార్టీ క్రమశిక్షణ పరంగా తీవ్రంగా పరిగణించబడుతుందని క్రమశిక్షణా సంఘం చైర్మన్ లింగంశెట్టి ఈశ్వర రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, సమావేశానికి గైర్హాజరైన 26 మంది సభ్యులు తమ గైర్హాజరుకు గల కారణాలను వివరిస్తూ, షోకాజ్ నోటీసు అందిన 48 గంటల్లోగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయానికి లిఖితపూర్వకంగా వివరణ సమర్పించాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+