Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఘనంగా షర్మిల కుమారుడు రాజా రెడ్డి-ప్రియ వివాహ వేడుకలు: జగన్ దూరం

జోధ్‌పూర్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ప్రియ అట్లూరితో ఘనంగా జరిగింది. రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో ఘనంగా జరిగాయి. జోధ్‌పూర్ ప్యాలెస్‌లో రాజారెడ్డి, ప్రియ అట్లూరి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.

కాగా, గత మూడు రోజులుగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. 16 నుంచి 18 వరకు వివాహ వేడుకలో భాగంగా 16వ తేదీన సంగీత్, మెహందీ కార్యక్రమం జరిగింది. శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజారెడ్డి, ప్రియలు బంధుమిత్రుల సాక్షిగా ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు షర్మిల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. పెళ్లి ఫొటోలు బయటకు రాలేదు కానీ.. హల్దీ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

YS sharmilas son Raja Reddy wedding celebrations in jodhpur

వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో నూతన వధూవరులు ముస్తాబవగా.. మిగిలినవారంతా పసుపు దుస్తుల్లో కనిపించారు. రాజా రెడ్డి, ప్రియల ఇరుకుటుంబాలు ఈ ఫొటోలలో కనిపించారు. షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్, కూతురు అంజలి, తల్లి విజయమ్మ రాజా రెడ్డి పక్కన ఉండగా.. ప్రియ తల్లిదండ్రులు, ఆమె సోదరుడు మరోపక్క నిలబడి ఉన్న ఫొటో ఆకట్టుకుంటోంది.

కాగా, ఫిబ్రవరి 18న ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. సాయంత్రం తలంబ్రాల వేడుక జరగనుంది. కాగా, ఈ వివాహ వేడుకలకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నారు. కొన్ని పనుల కారణంగా ఆయన ఈ వేడుకకు హాజరుకానట్లు తెలిసింది. అయితే, నూతన వధూవరులు ఇంటికి తిరిగి వచ్చాక.. జగన్ స్వయంగా వారిని కలిసి ఆశీర్వాదాలు ఇవ్వనున్నట్లు తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+