వివేకా హత్యను లైట్ తీసుకున్న జగన్ ? సీబీఐకి ఇస్తే బీజేపీలోకి అవినాష్ ! వాంగ్మూలంలో సునీత

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే వివేకా హంతకులెవరో గుర్తించిన సీబీఐ.. ఇక వారిని దోషులుగా నిరూపించేందుకు పూర్తిస్దాయి అధారాల వేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలో గతంలో సీబీఐకి ఈ కేసులో నిందితుల గురించి సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఈ కేసులో మరిన్ని సంచలనాలు తప్పేలా లేవు. ఈసారి స్వయంగా వివేకా కుమార్తె సునీత ఇచ్చిన వాంగ్మూలంలో వెలుగుచూసిన అంశాలు కలకలం రేపుతున్నాయి.

 వివేకా హత్యపై సునీతారెడ్డి

వివేకా హత్యపై సునీతారెడ్డి

తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై సీబీఐకి గత ఏడాది ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగుచూసింది. ఇందులో పలు కీలక అంశాలున్నాయి. వివేకా హత్య, అనంతర పరిణామాలు, ఈ హత్యపై ఎవరెలా స్పందించారు, ఎవరెవరి హస్తం ఉండొచ్చనే విషయాలపై సునీతారెడ్డి సీబీఐకి కీలక సాక్ష్యం అందించారు.

దీంతో ఇప్పుడు సునీతారెడ్డి సీబీఐకి చెప్పిన అంశాలు కీలకంగా మారేలా ఉన్నాయి. అన్నింటికీ మించి సీఎం జగన్ పేరును కూడా ఇందులో ఆమె ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

 వివేకా హత్యపై జగన్ స్పందన ఇదీ

వివేకా హత్యపై జగన్ స్పందన ఇదీ

సీబీఐకి సునీతా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో తన తండ్రిని ఎవరు చంపారో అందరికీ తెలుసన్నారు. ఈ హత్యపై సీఎం జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి చాలా తేలిగ్గా స్పందించారని తెలిపారు. తన తండ్రి హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు బాధించాయన్నారు. ఈ వ్యవహారాన్ని జగన్ కు, ఆయన భార్య భారతికి చెప్పినప్పుడు వారు స్పందించిన తీరుపై సునీత వ్యాఖ్యలు సీబీఐ వాంగ్మూలంలో కీలకంగా ఉన్నాయి.

నీ భర్తే హత్య చేయించాడేమో?

నీ భర్తే హత్య చేయించాడేమో?

తన తండ్రి వివేకానందరెడ్డి హత్యలో అనుమానితుల గురించి జగనన్నకు చెప్పానని, వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత వాపోయారు. దీంతో సీఎం జగన్ చేశారని చెప్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో జగన్ తన కుటుంబంలో ఒకరు ఇంకొకరిని ఎలా చంపుకుంటారంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు సునీత వాంగ్మూలం బయటికొచ్చిన నేపథ్యంలో జగన్ రియాక్షన్ ప్రాధాన్యం సంతరించుకుంది.

 వివేకా కేసు సీబీఐకి ఇస్తే అవినాష్ బీజేపీలోకి ?

వివేకా కేసు సీబీఐకి ఇస్తే అవినాష్ బీజేపీలోకి ?

వివేకా కేసు సీబీఐకి అప్పగింత విషయంలోనూ సునీతారెడ్డి వాంగ్మూలంలో కీలక అంశాలున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‍కు ఏమీకాదని, ఆయన బీజేపీలో చేరతాడని జగన్ చెప్పినట్లు సునీత వెల్లడించారు.ఇప్పటికే మాపై 11 కేసులున్నాయని, మీది 12వది అవుతుందన్నారు. నా తండ్రి హత్యను జగన్ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారన్న సునీత, సీబీఐ విచారణ కోసం నేను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల అన్నారంటూ సునీత తెలిపారు.

గత్యంతరం లేకే సీబీఐ వద్దకు

గత్యంతరం లేకే సీబీఐ వద్దకు

అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్‍లో ఆధారాలను మాయం చేశారని,అవినాశ్‍రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్‍ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని సునీత వాంగ్మూలంలో పేర్కొనట్లు తెలిసింది. తన తండ్రి వివేకా అంటే ఎంపీ అవినాశ్‍కు గిట్టదని కూడా సునీత చెప్పారు. హంతకులకు శిక్ష పడాలని.. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానని సునీతారెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+