జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం కడప రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఇప్పటికే వివేకా కేసు నిందితుడు అవినాష్ మరోసారి కడప ఎంపీ బరిలో దిగడంతో ఆయనకు పోటీగా సోదరి షర్మిల పోటీలో ఉన్నారు. దీంతో అవినాష్ కు మద్దతుగా జగన్, షర్మిలకు మద్దతుగా వివేకా కుటుంబం రాజకీయాలు చేస్తోంది. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో వైసీపీ తీరు, అవినాష్ కు జగన్ మద్దతు వంటి అంశాలను ప్రస్తావిస్తూ వివేకా భార్య సౌభాగ్యమ్య సీఎంకు లేఖ రాశారు.
2009 లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో, 2019 లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందని సౌభాగ్యమ్మ సీఎం జగన్ కు గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టినట్లు తెలిపారు. మన కుటుబంలోనీ వారే హత్యకు కారణం కావడం, హత్యకు కారణం ఆయిన వాళ్లకు నువ్వు రక్షణం గా ఉండటం సరికాదన్నారు.

నిన్ను సీఎం గా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నను ఈవిధంగా చేయడం, నీ పత్రిక, నీ టీవీ చానెల్, నీ సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం, చెప్పలేనంత విధంగా హననం చేయించడం తగునా అని సౌభాగ్యమ్మ ప్రశ్నించారు.న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్ళను హేళన చేస్తూ, నిందలు మోపుతూ,దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే, నీకు మాత్రం పట్టడం లేదా అని నిలదీశారు. సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిల ను కూడా టార్గెట్ చేస్తుంటే, నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏంటన్నారు.
కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం అని ప్రశ్నించారు. ఇంకా బాధించే అంశం..హత్యకు కారకులైన ఆయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించడం...ఇది సమంజసమా అని అడిగారు. ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏ మాత్రం మంచిది కాదన్నారు. ఇది నీకు తగదన్నారు. హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున , చివరి ప్రయత్నంగా...న్యాయం ధర్మం ఆలోచన చేయమని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని, ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, న్యాయం,ధర్మం,నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నట్లు సౌభాగ్యమ్మ తెలిపారు.












Click it and Unblock the Notifications